కుంభరాశి, మీన రాశి జూన్ నెల జాతక ఫలం పూర్తి వివరాలు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. తెలుగులో ఉన్న 12 రాశుల్లో కుంభ రాశి, మీన రాశి వారి జూన్ నెల జాతక ఫలం ఎలా ఉందో పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఫలితాలు గ్రహాల కదలికల ఆధారంగా ఉంటాయి. వ్యక్తిగత జాతకంలోని గ్రహ బలాన్ని బట్టి ఈ ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
కుంభ రాశి (ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
కుంభ రాశి వారికి ఈ జూన్ నెల మిశ్రమ ఫలితాలతో కూడి ఉంటుంది. ఏల్నాటి శని ప్రభావం కొనసాగుతున్నప్పటికీ, గురు, రాహువు అనుకూల సంచారం వల్ల కొన్ని కీలక పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తోటి ఉద్యోగులతో లేదా పైఅధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం ముఖ్యం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు ఈ నెల కొత్త పెట్టుబడులు పెట్టడానికి అంత అనుకూలమైన సమయం కాదు. లాభాలు సాధారణంగానే ఉంటాయి.

ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేదా ప్రయాణాల కొరకు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. అనవసరపు ఖర్చులను అదుపులో పెట్టుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. ఆరోగ్య విషయానికి వస్తే.. కంటి సమస్యలు లేదా అలసట, మానసిక ఒత్తిడి వేధించవచ్చు. సరైన విశ్రాంతి అవసరం. శనివారం రోజు శని దేవుడికి తైలాభిషేకం చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ప్రతికూలతలు తగ్గుతాయి.
మీన రాశి (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
మీన రాశి వారికి ఈ జూన్ నెల సవాలుతో కూడుకున్నది. మీన రాశిలో రాహువు, వ్యయంలో శని సంచారం వల్ల ప్రతి పనిలోనూ కొద్దిగా ఆలస్యం లేదా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ధైర్యంతో ముందడుగు వేస్తే సఫలమవుతారు. ఉద్యోగంలో మార్పులు లేదా స్థానచలనం కోరుకునే వారికి ఈ నెల సానుకూల ఫలితాలు వస్తాయి. పని పట్ల మీకున్న శ్రద్ధకు ప్రశంసలు దక్కుతాయి. అయితే, సహోద్యోగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగంలో ఉన్నవారికి పాత బాకీలు వసూలవుతాయి, కానీ భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం.
ఆదాయం బాగున్నప్పటికీ, దానికి సమానంగా ఖర్చులు కూడా ఉంటాయి. రియల్ ఎస్టేట్ లేదా భూముల కొనుగోలు వ్యవహారాల్లో పత్రాలను సరిగ్గా పరిశీలించిన తర్వాతే సంతకాలు చేయాలి. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా గ్యాస్ సమస్యలు, కడుపునొప్పి లేదా కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించడం మంచిది. గురువారం నాడు దత్తాత్రేయుడిని లేదా దక్షిణామూర్తిని పూజించడం, శనగలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.












Click it and Unblock the Notifications