AIADMK కు విజయ్ మాస్టర్ స్ట్రోక్, నలుగురు ఎమ్మెల్యేల రాజీనామా- బై పోల్స్, తాజా వ్యూహం..!!
తమిళనాడులో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పాలనలో తన మార్క్ చూపించుకొనే ప్రయత్నం చేస్తున్న సీఎం విజయ్ రాజకీయంగానూ బలోపేతం అయ్యే వ్యూహాలను అమలు చేస్తున్నారు. మిత్రిపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్.. వారి వ్యవహార శైలి తో ముందస్తుగానే మెజార్టీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. తన పార్టీలో చేర్చుకుంటున్నారు. ఉప ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు.
ముఖ్యమంత్రి విజయ్ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. అటు స్టాలిన్ పదే పదే విజయ్ ప్రభుత్వం కూలిపోవటం పైన హెచ్చరికలు చేస్తున్నారు. మిత్రపక్షాలు పరోక్షంగా విజయ్ పైన పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ తన ప్రభుత్వానికి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు సొంతంగా కూడగట్టుకొనే వ్యూహాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా AIADMK కు కి చెందిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్ జేసీడీ.ప్రభాకర్‌ను కలిసి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. వారిలో కె.మరగతం కుమరవేల్, ఎస్.జయకుమార్, పి.సత్యభామ ఉన్నారు. ఈ రోజు మరో ఎమ్మెల్యే వారి బాటే పట్టారు. ఈ నలుగురు త్వరలోనే సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది.

అయిదు స్థానాల్లో ఉప ఎన్నికలు
వీరి రాజీనామాలను స్పీకర్ ఆమోదంతో అసలు ఆట మొదలు కానుంది. ఇప్పటికే తిరుచ్చి సీటు కు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో.. తిరుచ్చి అసెంబ్లీ తో పాటుగా ఈ నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు రాజీనామా చేసిన ముగ్గురు సైతం టీవీకే పార్టీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమని తెలుస్తోంది. అయితే, ఈ ముగ్గురితోనే ప్రస్తుతం లెక్క ఆగదని.. ఇంకా బయటకు వచ్చే వారు ఉన్నారనే అన్నాడీఎంకే నేతల వ్యాఖ్యలు రాజకీయం గా ఇప్పుడు సంచలనంగా మారాయి. కేబినెట్ విస్తరణ పూర్తయిన తరువాత విజయ్ ఇప్పుడు కొత్త గేమ్ మొదలు పెట్టినట్లు స్పష్టం అవుతోంది. దీంతో.. ఇంకా ఎంత మంది ఎమ్మెల్యేలు బయటకు వస్తారు.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications