TTD:క్యూ లైన్లలో ఇక నో వెయిటింగ్, భక్తులకు 'రీ ఎంట్రీ' వెసులుబాటు - 2 గంటల్లో దర్శనం..!!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల వేళ రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం వస్తున్న వారితో కొండ కిటకిటలాడుతోంది. క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ తో రికార్డు దర్శనాలు కల్పిస్తున్నారు. అదే ఎక్కువ సమయం క్యూ లైన్లలో ఉండే పరిస్థితి ఏర్పడటంతో భక్తులకు కొత్తగా టీటీడీ రీ ఎంట్రీ అవకాశం కల్పించింది. దీని ద్వారా
క్యూలెన్లలో నుంచి బయటకు వచ్చి మళ్లీ వెళ్లే విధంగా అవకాశం ఏర్పడింది. దీనికి సంబంధించి న మార్గదర్శకాలను ఖరారు చేసారు.

తిరుమలలో దర్శనం కోసం 24 గంటల వరకు క్యూ లైన్లలో ఉండాల్సి వస్తుంది. ఒక్కో సందర్భం లో 32 గంటల సమయం తీసుకుంటోంది. దీంతో.. ఇన్ని గంటలు క్యూ లైన్లలో నిలబడి ఉండటం కష్టంగా మారుతోంది. దీంతో.. భక్తుల ఇబ్బందులను గమనించిన టీటీడీ కొత్త విధానం అందుబాటు లోకి తీసుకొచ్చింది. భక్తులు అవసరమైతే క్యూ లైన్ల నుంచి బయటకు వెళ్లి తిరిగి దర్శనానికి రెండు గంటల ముందు క్యూ లైన్లలో చేరే వెసులుబాటు కల్పించింది. గత వారం రోజులుగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సోమవారం 89,399 మంది భక్తులు స్వామి వారిని దర్శించున్నారు. దీంతో, పసిపిల్లలు, వృద్ధులతో వచ్చే భక్తులు గంటల తరబడి క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో ఉండాల్సిన అవసరం లేకుండా టీటీడీ 'రీ ఎంట్రీ' విధానం ప్రవేశపెట్టింది.

రుతుపవనాలు మరింత ఆలస్యం, మనకు అప్పుడే - మండుతున్న రాష్ట్రం..!!
రుతుపవనాలు మరింత ఆలస్యం, మనకు అప్పుడే - మండుతున్న రాష్ట్రం..!!
ttd-introduces-re-entry-facility-in-que-lines-for-sarvadarshanam-devotees-amid-heavy-tirumala-rush

రెండు గంటల ముందు తిరిగి క్యూ లైన్లలోకి

ఈ విధానం వినియోగం పైన టీటీడీ స్పష్టత ఇచ్చింది. క్యూ లైనలో గంటల కొద్దీ వేచి ఉండే వారికి తాత్కాలికంగా క్యూ లైన్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రీ ఎంట్రీ ద్వారా లైన్ లోకి వెళ్లేందుకు కొత్త విధానం ప్రారంభించారు. సర్వదర్శనం భక్తులు ముందుగా క్యూలైన్లోకి వెళ్లి క వైకుంఠం-2లో ఆధార్‌ సమర్పించి టోకెన్‌ తీసుకోవాలి. మధ్యలో బయటకు వెళ్లాలనుకుంటే 17వ కంపార్టుమెంట్‌ వద్ద 'రీఎంట్రీ' పాస్‌ తీసుకుని ఎగ్జిట్‌ పాయింట్‌ ద్వారా బయటకు వెళ్లాలి. తమకు కేటాయించిన సమయం వచ్చే వరకు తమ గదులకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడమో లేదా తిరుమలలోని ఇతర ప్రదేశాలను సందర్శించడానికి సమయం దొరుకుతుంది. తిరిగి క్యూ లైన్ లోకి వెళ్లేందుకు పాస్ పైన కేటాయించిన సమయానికి 15 నుంచి 20 నిమిషాల ముందుగానే సంబంధిత కంపార్టు మెంట్‌ వద్దకు చేరుకోవాలి. బయటకు వచ్చిన కంపార్ట్​మెంట్లు కాకుండా మ్యూజియం పక్కన, డబ్ల్యూ-4 గేట్‌ మీదుగా రీ-ఎంట్రీ కేంద్రం వద్దకు చేరుకుంటే లోపలికి వెళ్లి కేవలం 2 నుంచి 4 గంటల వ్యవధిలోనే స్వామివారిని దర్శించుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+