వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి బెయిల్ డీల్: మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి గరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Erasu Pratap Reddy
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం సస్పెన్షన్‌కు గురైన న్యాయమూర్తి పట్టాభి రామారావుతో డీల్ నడపడంలో మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ప్రముఖ పాత్ర వహించారని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన న్యాయ, జైళ్ల శాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి పట్టాభి రామారావుకు గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ముడుపులను చేరవేయడంలో పాత్ర వహించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై ఏరాసు ప్రతాప రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మిగతా కొన్ని చానెళ్లలో ఆయన పేరు చెప్పకుండా ఆయన గుర్తుకు వచ్చేలా వార్తాకథనాలను ప్రసారం చేశాయి.

గాలి జనార్దన రెడ్డి బెయిల్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, దీనిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన అన్నారు. గాలి బెయిల్ వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని స్పష్టం చేశారు. తనపై బురద వేసి తుడుచుకొనేలా చేస్తే మాత్రం పరువు నష్టం దావా వేస్తానని, ఇప్పటికే న్యాయవాదులతోనూ మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు.

"న్యాయ శాఖ మంత్రిని అయినంత మాత్రాన నిందితులకు బెయిల్ ఇప్పించే బ్రోకర్‌లా వ్యవహరిస్తానని ఎలా అనుకుంటారు? నాకు గాలి జనార్దన రెడ్డి బంధువైనంత మాత్రాన నా బాధ్యతను విస్మరించి బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని ఎలా అనుకుంటారు?'' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తనపేరు ప్రస్తావనకు రావడం మనస్తాపానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గాలి జనార్దన్ రెడ్డి తనకు బంధువు అవుతారని అసెంబ్లీలోనే చెప్పానని, అంత మాత్రాన బెయిల్ ఇప్పిస్తానని ఎలా అనుకుంటారని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి తనకు బంధువులు అవుతారని, అయినా తాను ఏనాడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని ఆయన అన్నారు. తన రాజకీయ జీవితంలో మచ్చ లేదని ఆయన అన్నారు. తనపై బురద చల్లే కార్యక్రమం తప్ప మరోటి కాదని ఆయన అన్నారు.

కాగా, పట్టాభి రామారావు వ్యవహారాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడానికి ముడుపులు తీసుకున్నట్లు పట్టాభి రామారావుపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది.

English summary
The Law minister Earsu Pratap reddy expressed anguish at media reports implicating him in the deal of Karnataka former minister Gali Janardhan Reddy with Pattabhi Ramarao in bail issue. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X