గబ్బర్ సింగ్: లగడపాటి, శోభకు బట్టలు పెట్టా: చిరు

Lagadapati Rajagopal-Chiranjeevi
హైదరాబాద్: సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణను కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గబ్బర్ సింగ్‌గా అభివర్ణించారు. లక్ష్మినారాయణ గబ్బర్ సింగ్ మాదిరిగా అవినీతి భరతం పడుతున్నారని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రయోజనం కోసమే సిబిఐ దర్యాప్తు విషయంలో కాంగ్రెసు పార్టీని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టు వెనక కుట్ర ఉందనే ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్‌కు త్వరగా శిక్షపడాలని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఒక్కో చార్జిషీట్‌పై విచారించడానికి ఒక్కో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నేరం రుజువైతే జగన్‌కు పెద్ద శిక్ష పడుతుందని ఆయన అన్నారు.

వైయస్ జగన్‌కు శిక్ష పడడం ఖాయమని ఆయన అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి జగన్ అనర్హుడని ఆయన అన్నారు. జగన్‌కు ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డి మేళ్లు చేశారని ఆయన అన్నారు. కాంగ్రెసులో ఉంటే వైయస్ జగన్ ఏడాది క్రితమే అరెస్టయి ఉండేవారని, వైయస్ జగన్ అరెస్టులో సిబిఐ ఆచితూచి వ్యవహరించిందని ఆయన అన్నారు.

కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి శనివారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కాంగ్రెసు తరఫున ప్రచారం నిర్వహించారు. శోభా నాగిరెడ్డి దంపతులపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శోభా నాగిరెడ్డి తన ఇంటికి వస్తే బట్టలు పెట్టి ఆదరించానని, తనను భూమా దంపతులు మోసం చేశారని ఆయన అన్నారు. భూమా దంపతులను నమ్మినందుకు తనను క్షమించాలని ఆయన ప్రజలను కోరారు. శోభా నాగిరెడ్డికి ఓటేస్తే అవినీతికి ఓటేసినట్లేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, సంక్షేమ పథకాల అమలు ఆగిపోదని ఆయన అన్నారు.

తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై విమర్శలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మపై మహిళా కాంగ్రెసు నేతలు ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకరరావు అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడే వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ప్లాన్ చేసినట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సోనియాపై వైయస్ విజయమ్మ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదమని ఆయన హైదరాబాదులో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి శవం అలా ఉండగానే వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి సంతకాల సేకరణ జరిపారని ఆయన అన్నారు.

సూట్‌కేసు రాజకీయాలు వద్దని కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసి రెడ్డి వైయస్ విజయమ్మకు సూచించారు. రాజకీయాలు చేయడం మానుకోవాలని కూడా ఆయన సూచించారు. ఆయన శనివారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విమర్శలు చేయడం వైయస్ విజయమ్మ మానుకోవాలని ఆయన అన్నారు. వైయస్ విజయమ్మ ఆరోపణలను పసి పిల్లలు కూడా నమ్మబోరని ఆయన అన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన విజయమ్మకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+