హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిలకు కౌంటర్: అనిల్ బయ్యారం గనుల ఇష్యూ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharmila
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చెల్లె షర్మిలను కౌంటర్ చేయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఆమె భర్త అనిల్ బయ్యారం గనుల వ్యవహారాన్ని ముందుకు తెస్తున్నాయి. పార్టీ గౌరవాధ్యక్షురాలు, తల్లి వైయస్ విజయమ్మకు తోడుగా వెళ్లిన షర్మిల ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి స్టార్ కాంపైనర్‌గా మారిపోయారు. దీంతో షర్మిలపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైయస్ విజయమ్మ, షర్మిల వెంట ప్రచారంలో అనిల్ కూడా ఉంటున్నారు.

జగన్ సతీమణి భారతి కూడా షర్మిలను వైయస్ విజయమ్మ తోడు తీసుకోవడం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైయస్ రాజశేఖర రెడ్డి కూడా కూతురు షర్మిలకు, అల్లుడు అనిల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని అంటారు. వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్‌కు చెందినదిగా ఆరోపణలున్న బయ్యారం గనులు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఆ గనులతో తనకు ఎలాంటి సంబంధం లేదని అనిల్‌ ఖండించారు.

షర్మిలకు ప్రచారం సందర్భంగా జనంలో ఇమేజ్‌ పెరుగుతోంది. ఆమె కొద్దిసేపు మాత్రమే మాట్లాడుతున్నప్పటికీ, షర్మిళ ప్రసంగానికి విజయమ్మ కన్నా ఎక్కువ స్పందన కనిపిస్తుండటం గమనార్హం. ‘సోనియా గాంధీ గారు మా తండ్రిని పెద్ద లీడరు చేశారంటున్నారు. అదే నిజమయితే కిరణ్‌కుమార్‌రెడ్డిని అంత లీడర్‌గా ఎందుకు తయారు చేయలేక పోయింది’పంచ్ డైలాగులను షర్మిల విసురుతున్నారు. పార్టీ గుర్తు ఫ్యానును స్వయంగా తిప్పుతూ, జగనన్నను సీఎం చేయాలని పిలుపునిస్తున్నారు. వైయస్ జగన్ అరెస్టయిన తర్వాత షర్మిల లీడ్ తీసుకుని రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు.

జగన్ సతీమణి భారతి హైదరాబాదులో న్యాయవాదులను సమన్వయం చేసుకోవడం, జగన్‌తో మాట్లాడటం, కీలక వ్యవహారాలు చక్కబెట్టడంతో పాటు వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారని అంటున్నారు. అందుకే ఆమె ప్రచారానికి వెళ్లలేదని చెబుతున్నారు. అనూహ్యంగా షర్మిల రాజకీయ వర్గాల్లో ప్రధాన పాత్రగా మారిపోయారు. ప్రత్యర్థులు విస్మరించలేని స్థితికి ఆమె చేరుకున్నారు. షర్మిల చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. ఆమె ఆరోపణలను ఆయన ఖండించారు. దీంతో ప్రధాన రాజకీయ నేతల శ్రేణిలో ఆమె చేరిపోయారనే ప్రచారం జరుగుతోంది.

English summary
Congress and Telugudesam leaders are trying to counter YSR Congress party president YS Jagan's sister Sharmila taking the issue of Bayyaram mines, alleged to belongs her husband Anil. She is attacking YS Jagan's rivals with punch dailogues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X