నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ సమైక్యవాది, జగన్‌ది దారి కాదు: లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
నెల్లూరు/ హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సమైక్యవాది అని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్రం విడిపోదని ఆయన అన్నారు. సోమవారం ఆయన నెల్లూరు జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయాన్ని నిలబెడుదామని ఆయన పిలుపునిచ్చారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, బిజెపి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన విమర్శిచారు. తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుస్తాయని, తద్వారా తెలంగాణ ఏర్పడుతుందని గతంలో కెసిఆర్ ప్రకటించారని, దాన్ని వైయస్ జగన్ ఖండించారని ఆయన అన్నారు. జగన్ వైయస్ రాజశేఖ రెడ్డి అడుగుజాడల్లో నడవడం లేదని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విడిపోవద్దని ఆయన అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు మండిపడ్డారు. విజయమ్మ ఆలోచన సరిగా లేదని, ప్రజా కోర్టులో తేల్చుకుంటామని చెబుతున్న విజయమ్మ, పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టించి కేసులను వాదింపజేస్తున్నారని, ప్రజాకోర్టులో తేల్చుకుంటామని భావించినప్పుడు న్యాయవాదులను పెట్టడం ఎందుకని ఆయన అన్నారు.

వైయస్ జగన్ వల్ల చాలా మంది జైలుకు వెళ్లారని, వారి కుటుంబాలను వైయస్ విజయమ్మ ఎందుకు పరామర్శించలేదని ఆయన సోమవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ జగన్ మంగలి కృష్ణ వంటివాళ్లతో కలిసి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. జగన్ నిర్దోషి అని, ఏ తప్పూ చేయలేదని వైయస్ విజయమ్మ అనడాన్ని ఆయన ఖండించారు.

వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో చేతులు కలిపారని, వైయస్ రాజశేఖర రెడ్డి ఏ రోజు కూడా చంద్రబాబుతో చేతులు కలపలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతో కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చడానికి వైయస్ జగన్ ప్రయత్నించారని ఆయన అన్నారు. అది వైయస్ రాజశేఖర రెడ్డి ఆలోచన కాదని ఆయన అన్నారు. విదేశాల్లోని నల్లధనం గురించి మాట్లాడడానికి ముందు అన్నా హజారే, రాందేవ్ దేశంలోని అవినీతి గురించి మాట్లాడాలని, వారిద్దరు యుపిఎ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికే ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

English summary
Congress MP Lagadapati Rajagopal said that YSR Congress party president YS Jagan is not following YS Rajasekhar Reddy's path. He criticized that YS Jagan is having secret understanding with BJP and TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X