అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను కాదని..: అనంతలో గాలిని టార్గెట్ చేసిన బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
అనంతపురం/హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన అనంతపురం రాయదుర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాలి తన బెయిల్ కోసం రూ.60 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. గాలి అందరికీ లంచాలిస్తాడని, చివరకు దేవుళ్లను కూడా వదలలేదన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రూ.45 కోట్లు, శ్రీకాళహస్తీశ్వరుడికి రూ.15 కోట్లు ఇచ్చారన్నారు.

రాయదుర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కాపు రామచంద్ర రెడ్డికి త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే పడుతుందన్నారు. కాపుకు జైలు తప్పదన్నారు. వైయస్సార్ కాంగ్రెసుకు ఓటు వేస్తే అవినీతిని ప్రోత్సహించడమే అన్నారు. గాలి తన బెయిల్ కోసమే రూ.60 కోట్లు లంచంగా ఇచ్చారంటే ఆయన దోపిడీ ఎంతగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెసు దొంగల పార్టీ అయితే వైయస్సార్ కాంగ్రెసు గజదొంగల పార్టీ అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

అంతకుముందు విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెసు స్వార్థ రాజకీయాలను ప్రజలు గమనించాలన్నారు. జగన్ కాంగ్రెసులో కొనసాగితే ముఖ్యమంత్రి అయి ఉండేవారని కాంగ్రెసు నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. పార్టీలో కొనసాగితే అవినీతిపరులను కూడా అందలమెక్కిస్తారా అని ప్రశ్నించారు. దేశంలో రాజకీయ ప్రక్షాళణ జరగాలని అభిప్రాయపడ్డారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రక్షాళణ ఒక్కటే మార్గమన్నారు.

తెలుగుదేశం పార్టీ నుండి ఎవరైనా ప్యాకేజీలకు ఆకర్షితులై బయటకు వెళితే చరిత్ర హీనులు అవుతారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్న పార్టీని ఎవరూ వీడరన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబు, సంఘ సంస్కర్త అన్నా హజారే ఉద్యమాలలో పాల్గొనేందుకు పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

జగన్ ఏం తప్పు చేశాడో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు ఇంకా అర్థం కాలేదా అని హైదరాబాదులో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అక్రమంగా భూములను సేకరించి, జగన్‌కు లబ్ధి చేకూర్చారని, ఈ విషయం ఆమెకు తెలియక పోవడం శోచనీయమన్నారు. తల్లీ, బిడ్డ వంటి భూమిని, రైతును దివంగత వైయస్ వేరు చేశారని అన్నారు.

విజయమ్మ, షర్మిల మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఉసురే వారికి తగిలిందన్నారు. జగన్ అవినీతికి మద్దతు తెలిపిన మంత్రులను కూడా అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జగన్ అప్రూవర్‌గా మారాలని రాజేంద్ర ప్రసాద్ సూచించారు. భూములు కోల్పోయిన వారికి సమాధానం చెప్పాకే విజయమ్మ ప్రచారం నిర్వహించాలన్నారు. వైయస్ చట్ట విరుద్దంగా లక్షన్నర ఎకరాలు సేకరించారని, తాము అధికారంలోకి వస్తే వాటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu targetted Karnatka former minister Gali Janardhan Reddy in his Ananthapur district bypolls campaign. He said YSR Congress party candidate Kapu Ramachandra Reddy will sent to jail soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X