హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి ఆ నైతిక హక్కు లేదు: జగన్ పార్టీ నేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar Rao
హైదరాబాద్: ఆడమనిషి కాబట్టి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు చెప్పారు. తమ పార్టీలో ఉంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవారంటూ చెప్పిన గులాం నబీ ఆజాద్ ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఉర్దూ తెలియనివారు రాష్ట్రంలో ఎవరూ లేరని, తాను ఉర్దూలో మాట్లాడడం వల్ల మీడియా ప్రతినిధులు సరిగా అర్థం చేసుకోలేదని ఆజాద్ అనడం సరి కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సంతకం పెట్టాలంటే తాము పెట్టామని చెబుతున్న మంత్రులు గాడిదలు కాయడానికి పదవులు స్వీకరించారా అని ఆయన అడిగారు. ప్రజలకు బాధ్యత వహించవలసిన మంత్రులు తప్పించుకుందామంటే కుదరదని ఆయన అన్నారు. మొత్తం జగన్‌పై నెట్టి, వైయస్ రాజశేఖర రెడ్డని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తే ప్రజలు సహించబోరని ఆయన అన్నారు.

ఉప ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి లేదని ఆయన అన్నారు. చిరంజీవి కూతురు ఇంట్లో 70 కోట్ల రూపాయలు దొరికాయని, దానికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు చిరంజీవికి లేదని ఆయన అన్నారు. జగన్ ఇంట్లో సోదాలు చేస్తే పది రూపాయలు గానీ, తులం బంగారం గానీ దొరకలేదని ఆయన చెప్పారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి జగన్‌ను నిలువరించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆ రెండు పార్టీలు టూరింగ్ టాకీసు డ్రామా ట్రూప్‌ల మాదిరిగా తయారయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌ను జైలులో పెట్టినంత మాత్రాన జగన్ నేరం చేసినట్లు వ్యక్తి కాదని ఆయన అన్నారు. సిబిఐ కేంద్రం ఏది చెప్తే అది చేస్తూ కీలుబొమ్మలా తయారైందని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు తమవని చెప్పుకునే కాంగ్రెసు పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఆ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని జూపూడి ప్రభాకర రావు ప్రశ్నించారు. వైయస్ మరణంపై అనేక అనుమానాలున్నాయని, తమ పార్టీ మొదటి నుంచి అనేక మార్లు అనుమానాలు వ్యక్తం చేసిందని ఆయన అన్నారు.

English summary
YSR Congress leader Jupudi Prabhakar Rao said that Congress Rajyasabha member Chiranjeevi has no moral right to criticize YS Rajasekhar Reddy's family. He said that Chiranjeevi has to clarify about the amount seized by IT official from his daughter's house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X