'సత్యం' రాజు అస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి

Satayam Ramalinga Raju
హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న సత్యం కంప్యూటర్స్ కంపెనీ ప్రమోటర్ల కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రంగారెడ్డి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ ప్రమోటర్లకు చెందిన ఆస్తుల విలువ 2.48 కోట్ల రూపాయల మేర ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 44 రకాల ఆస్తుల జప్తునకు అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఫైల్‌పై సంతకం చేశారు. సత్యం కంప్యూటర్స్ అధినేతగా రామలింగ రాజు ఉన్నప్పుడు భారీ కుంభకోణం జరిగింది.

సత్యం ప్రమోటర్ల కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈ ఆస్తుల జప్తునకు సిబిఐ రేపు (శుక్రవారం) సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఇదే వ్యక్తులకు చెందిన మూడు కోట్ల 87 లక్షల రూపాయల ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యం కంప్యూటర్స్ కంపెనీ ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యులకు చెందిన ఏడు కీలకమైన కంపెనీల పేర్ల మీద 44 రకాల ఆస్తులు రిజిష్టరై ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, 7000 వేల కోట్ల సత్యం కంప్యూటర్ల కుంభకోణంలో 2009 జనవరిలో అరెస్టు అయిన విషయం తెలిసిందే. హైదరాబాదులోని చంచల్‌గుడా జైలు నుంచి సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు నిందితుడు రామలింగరాజు నిరుడు నవంబర్ 5వ తేదీన విడుదలయ్యారు. అరెస్టయి 32 నెలలు గడిచిన తర్వాత ఆయనకు జైలు నుంచి విముక్తి లభించింది. ఆయనతో పాటు ఎనమండుగురికి సుప్రీంకోర్టు చేసింది.

రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, ఆడిటర్ వడ్లమాని శ్రీనివాస్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన మీడియాతోనే కాకుండా ఎవరితోనూ మాట్లాడకుండా కారులో ఎక్కి ఇంటికి వెళ్లిపోయారు. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు 2009 జనవరి 9వ తేదీన అరెస్టయ్యారు. 2009 సెప్టెంబర్ 7వ తేదీన అనారోగ్యంతో ఆయన హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చేరారు. ఆ తర్వాత నవంబర్ 25వ తేదీన జైలుకు వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+