ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్తులపై చిరు విచారణకు సిద్ధమా: హరిరామ జోగయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Harirama Jogaiah
ఏలూరు/ ఒంగోలు/ వరంగల్: ఆస్తులపై కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య సవాల్ విసిరారు. చిరంజీవి తాను సంపాదించిన మొత్తం ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విచారణకు సిద్ధమా అని ఆయన అడిగారు. గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలపై కూడా చిరంజీవి సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం కావాలని, అలా సిడ్ధమైనప్పుడు మాత్రమే ప్రజలు చిరంజీవి నిజాయితీని గుర్తిస్తారని ఆయన అన్నారు. ప్రజలు నమ్మి ఓటేస్తే మూడు పదవులు 300 కోట్ల రూపాయలకు చిరంజీవి అమ్ముకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెసు నీచ రాజకీయాలకు పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒంగోలు శానససభా స్థానం అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. వాన్‌పిక్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఆయన గురువారం ప్రకాశం జిల్లా కొత్తపట్నం ఎన్నికల ప్రచార సభలో అన్నారు. వాన్‌పిక్‌లో తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఉరేసుకుంటానని ఆయన అన్నారు. దమ్ముంటే మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

ఓడిపోతామనే భయంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తనపై నీచ రాజకీయాలకు పాప్లపడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరకాల శానససభ సీటు అభ్యర్థి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. పదిహేను రోజుల క్రితం ఒక వృద్ధురాలిని కలిసి ఓటు అడిగిన విజువల్స్‌కు మరికొన్నింటిని కలిపి కొన్ని చానెల్స్ తనపై దుష్ర్రచారం చేస్తున్నాయని ఆమె గురువారం వరంగల్ జిల్లా పరకాలలో అన్నారు. నిజాయితీగా ఎదుర్కునే దమ్ము లేకనే అడ్డదారులు తొక్కుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై తాను ఈసికి ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పారు.

English summary
YSR Congress senior leader challenges Congress Rajyasabha member Chiranjeevi to accept for probe on his properties. He said that Chiranjeevi should prepare for ED probe to prove his innocence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X