వైయస్ మంత్రివర్గం విచారణకు సుప్రీంలో పిటిషన్

ఇదే కేసులో ఆరుగురు మంత్రులు, ఏడుగురు ఐఎఎస్ అధికారులకు మార్చి 12వ తేదీన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరుగురినే కాకుండా మొత్తం మంత్రివర్గాన్ని విచారించాలని సుధాకర్ రెడ్డి గురువారం పిటిషన్ దాఖలు చేశారు. జీవోల అమలుకు ఆర్టికల్ 164(2) ప్రకారం మంత్రులంతా బాధ్యులేనని సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ జీవోలన్నీ భూములకు, నీళ్లకు, గనులకు సంబంధించినవని, వీటి అమలుకు మంత్రులందరినీ బాధ్యులను చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా బాధ్యుడ్ని చేయాలని సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టును కోరారు. జీవోలను అమలు చేసినవారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జీవోల అమలుకు సంబంధిత మంత్రులే కాకుండా మంత్రివర్గమంతా బాధ్యత వహిస్తుందని నిబంధనలున్నాయని ఆయన చెప్పారు. ఈ నిబంధనలను ఆయన ఉటంకించారు.
సంబంధిత మంత్రిది ప్రాథమిక బాధ్యత కాగా, మంత్రివర్గమంతా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మంత్రుల వ్యక్తిగత బాధ్యతతో పాటు మంత్రివర్గ సభ్యులంతా జీవోల అమలుకు బాధ్యులేనని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన వివాదాస్పదమైన 26 జీవోలపై సిబిఐ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications