చిరుకు వేసినట్లే: సిఎం, వైయస్ ఆత్మ విలవిల: చిరు

Chiranjeevi-Kiran Kumar Reddy
కడప: కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మల్లికార్జున్ రెడ్డికి ఓటేస్తే చిరంజీవికి ఓటేసినట్లేనని, తనకు ఓటేసినట్లేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కడప జిల్లాలో ఆయన రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను తాము జైలుకు పంపించలేదని, ఆర్థిక నేరాలతో జగనే వెళ్లారని ఆయన అన్నారు. చేసిన నేరాలు రుజువైతే వైయస్ జగన్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని ఆయన చెప్పారు. జగన్ చేసిన నేరాల తీవ్ర అంతగా ఉందని, ఈ విషయం తప్పకుండా చెప్పాల్సిందేనని ఆయన అన్నారు.

నేరాలు చేసినప్పుడు ఆ నేరాల తీవ్ర ఏమిటో, ఏ విధమైన శిక్ష పడుతుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వైయస్ మృతిని ప్రస్తావించి రాజకీయ ప్రయోజనం పొందాలని వైయస్ కుటుంబం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు జరిగిందని, అప్పుడు వైయస్ జగన్‌కు క్లీన్ చిట్ లభించిందని, అప్పుడు సిబిఐని ప్రశంసించారని, ఇప్పుడు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. తమకు అనుకూలంగా వస్తే సిబిఐ మంచిది, తమకు వ్యతిరేకంగా వస్తే చెడ్డదా అని ఆయన అడిగారు. వైయస్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురవుతుందని తెలిసి ఉంటే ప్రాణాలు అడ్డం పెట్టయినా ఆపి ఉండేవాళ్లమని ఆయన అన్నారు.

వైయస్ జగన్ తీరు చూసి వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ విలవిలలాడుతుందని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. వైయస్ జగన్ అక్రమాలకు పాల్పడి లక్ష కోట్ల రూపాయలకు పడగలెత్తారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే అవినీతి వేసినట్లేనని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని చంపాల్సిన అవసరం కాంగ్రెసు పార్టీకి లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు తన మాతృ పార్టీ అని వైయస్ చెప్పారని, సోనియాను దేవతగా అభివర్ణించారని, అయితే జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెసును శత్రుపార్టీగా చూస్తున్నారని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డిని చంపారని వైయస్ విజయమ్మ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. వాతావరణం సరిగా లేకపోవడం వల్లనే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. అనుమానం ఉంటే విజయమ్మ శాసనసభలో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన అడిగారు. ప్రమాదమేనని విజయమ్మ నమ్మారని ఆయన అన్నారు. సానుభూతిని ఓట్లుగా మార్చుకోవడానికి విజయమ్మ తప్పు ప్రచారానికి దిగుతున్నారని, ఇది ఆమె స్థాయికి తగింది కాదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు వైయస్ జగన్ శవం అలా ఉండగానే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ జరిపారని ఆయన అన్నారు. తన వద్దకు కూడా మనుషులను పంపించారని ఆయన అన్నారు. రాజీవ్ గాందీ మరణిస్తే రాజకీయాల్లోకి రావడానికి సోనియా గాంధీకి ఐదేళ్లు పట్టిందని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారని, యాత్ర చేస్తూనే ఉన్నారని, ఓర్పు లేని యాత్ర అని, జగన్‌కు ఓర్పు లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+