ఎందుకు?: ఉత్సాహంగా వెళ్లి విచారంగా జైలుకు జగన్!

మొహం పూర్తిగా అలసిపోయినట్లుగా కనిపించింది. కారణమేమిటో తెలియరాలేదు.
కాగా జగన్ మొదటి రోజు కస్టడీ శనివారం పూర్తయిన విషయం తెలిసిందే. విదేశీ కంపెనీలు, వందల కోట్ల విలువైన సంస్థలను కారుచౌకగా సొంతం చేసుకోవడంపై జగన్‌ను ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శనివారం ఉదయం 10.30 గంటలకు జగన్‌ను చంచల్‌గూడ జైలు నుంచి కోఠిలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. సాయంత్రం 5 గంటల వరకు ఆయనను ప్రశ్నించారు. భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, సండూర్ పవర్ కంపెనీల్లోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల గురించి సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
సంస్థల్లో 533 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన ఐదు కంపెనీలను కేవలం నాలుగు కోట్ల రూపాయలకే టేకోవర్ చేసుకున్నారని, ఇదెలా సాధ్యపడిందని, ఇంతకూ ఈ కంపెనీలకు యజమానులున్నారా అని ఏషియన్ ఇన్‌ఫ్రా కంపెనీకి యజమాని ఎవరని, ఒకరేనా లేక ఎక్కువమంది ఉన్నారా అని సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అయితే... అవన్నీ ఆడిటర్ విజయ సాయి రెడ్డి చూసుకుంటారని జగన్ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.
శనివారం తమకు అందుబాటులో ఉండాలని సాయి రెడ్డితోపాటు నగల వ్యాపారి సుఖేశ్ గుప్తాను సిబిఐ ఆదేశించింది. కానీ... వీరిద్దరినీ సిబిఐ విచారణకు పిలవలేదు. కోల్‌కతా, రాజ్‌కోట్, చెన్నై, పుణె తదితర ప్రాంతాల్లో కేవలం కాగితాలపై ఏర్పాటైన కంపెనీల నుంచి వచ్చిన నిధుల వరదపైనా సిబిఐ ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే... జగన్ నుంచి మౌనం, సాయి రెడ్డికే తెలుసని సమాధానాలు మాత్రమే వచ్చినట్లు సమాచారం. ఆదివారంతో జగన్ రెండో విడత కస్టడీ కూడా ముగుస్తోంది.












Click it and Unblock the Notifications