మరి మీరెందుకెళ్లలేదు: షర్మిలకు తులసి రెడ్డి కౌంటర్

వైయస్ చిత్తూరు జిల్లాకు కేవలం అధికారిక పర్యటన నిమిత్తమే కాదని, శుభకార్యానికి హాజరయ్యేందుకు కూడా వెళ్లారని వారు చెప్పారు. అలాంటప్పుడు కుటుంబ సభ్యులతో కలసి వైయస్ హెలికాప్టర్‌లో ప్రయాణం చేసిన ఉదంతాలు ఉన్నాయని చెప్పారు. ఆ సంప్రదాయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, షర్మిల ఆ రోజెందుకు పాటించలేదని తులసి రెడ్డి సందేహం వ్యక్తం చేశారు.
జగన్ ఓ క్రిమినల్ అని, ఆయన నేపథ్యం తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని, ఆయన అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావని, ఆయన పార్టీకి ఓటు వేస్తే తీరని నష్టం జరుగుతుందని ప్రజలు గ్రహించాలని రాజ్యసభ సభ్యుడు హనుమంత రావు న్యూఢిల్లీలో హెచ్చరించారు. భాను కిరణ్‌కు, మంగళి కృష్ణకు ఉన్న సంబంధాల గురించి జగన్ కానీ, విజయమ్మ కానీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
వైయస్ హయాంలో జగన్ జోక్యంతో భూములు, ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలు, గనులు తదితర కేటాయింపుల్లో రూ.17 లక్షల కోట్ల మేరకు లూటీ జరిగిందని ఆరోపించారు. వైయస్ మరణంపై ప్రజల్లో సానుభూతి కోసం ఆరోపణలు చేస్తున్న విజయమ్మ ఆనాడు భద్రత సలహాదారుగా ఉన్న కెవిపి రామచంద్ర రావు, ఏవియేషన్ ఎండి బ్రహ్మానంద రెడ్డి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కెవిపి అయినా విజయమ్మ వ్యాఖ్యలపై స్పందించాలన్నారు. వైయస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించినప్పుడు ప్రశ్నించడానికి చాలా మంది భయపడ్డారని, ఇప్పుడు అవన్నీ బయటపడుతున్నాయని విహెచ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications