జగన్‌కు సహనం లేదు: చిరు, షర్మిలకు బొత్స కౌంటర్

సానుభూతితో ఓట్లు పొందాలనుకునే వారికి బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వైయస్ జగన్ పార్టీకి ఓటేస్తే అవినీతికి మద్దతిచ్చినట్లే అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఆ ఓటు కుళ్లిపోతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని జగన్ చూడటం సిగ్గుచేటు అన్నారు. నెల్లూరు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే టి.సుబ్బిరామి రెడ్డికి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని సూచించారు.
జగన్ పార్టీకి ఓటేస్తే అవినీతికి ఓటేసినట్లేనని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ హైదరబాదులో అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకొని కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెసు పార్టీ ప్రచార అస్త్రాలు అన్నారు. జగన్ ఆర్థిక నేరాలలో చిక్కుకొని సిబిఐ కస్టడీలో ఉన్నారని, అలా జైలులో ఉన్న వ్యక్తికి ఓటు వేయవద్దని కోరారు.
టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ప్రచారంలో ఎక్కడా ప్రజా సమస్యలు ప్రస్తావించడం లేదన్నారు. వైయస్ విజయమ్మ చెప్పేవి నిజాలో అబద్దాలో తెలుసుకోవాలన్నారు. జగన్ సోదరి షర్మిలకు నీతి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. బయ్యారం గనుల విషయంలో షర్మిల నీతి ఎంటో చెప్పాలన్నారు. అన్న జైలుకు ఎందుకు వెళ్లాడో షర్మిలకు తెలియదా అని ప్రశ్నించారు.
జగన్ కేసు సిబిఐ చూసుకుంటుందని, తమకు సంబంధం లేదని, జగన్ కేసుపై తాము ఏమీ మాట్లాడమని వాయలార్ రవి అన్నారు. గాంధీ భవననంలో వాయలార్ రవితో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ తదితరులు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications