ప్రేమ పెళ్లి, ఇంటిపై దాడి: ఎన్‌కౌంటర్లో రౌడీషీటర్ మృతి

కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో రౌడీషీటర్ సుధీర్ మృతి చెందాడు. పట్టణంలోని పవర్ హౌస్ కాలనీకి చెందిన సుధీర్ కరీంనగర్, గోదావరిఖనిలో జరిగిన రెండు హత్య కేసులలో నిందితుడు. ఇటీవల సప్తగిరి కాలనీలో చికెన్ వ్యాపారిపై దాడి చేయడంతో పాటు సుధీర్ గ్యాంగ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామను సుధీర్ రాజేష్ థియేటర్ సమీపంలో ఉన్నట్లుగా తెలుకుసున్న పోలీసులు అక్కడకు వెళ్లారు.
పోలీసులను గమనించిన వెంటనే సుధీర్ తన వద్ద ఉన్న తపంచాతో కాల్పులు జరిపాడు. పారిపోయేందుకు ప్రయత్నాలు చేశాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం పోలీసులు మృతదేహం వద్ద తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలిని డిఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.
వరంగల్ జిల్లా పరకాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. గీసుకొండ మండలం ధర్మారానికి చెందిన అనసూయ తెరాస బహిరంగ సభకు హాజరై ఆటోలో తిరిగి ఇంటికి వస్తుండగా ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు మహిళలను ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications