హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బయ్యారం తర్వాత సర్కారు మరో షాక్: వాన్‌పిక్ దిశగా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Govt mulling to cancel VANPIC
హైదరాబాద్: ఇప్పటికే బయ్యారం గనుల లీజులను, బ్రాహ్మిణి ఇండస్ట్రీస్ లీజులను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తన అడుగులు వాన్‌పిక్ వైపు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో బ్రాహ్మిణీ స్టీల్స్ ఒప్పందాన్ని రద్దు చేసిన ప్రభుత్వం సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్‌కు చెందిన బయ్యారం గనుల ఒప్పందాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాన్‌పిక్ రద్దు చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది.

ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలువురు సీనియర్ అధికారులతో పాటు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి హాజరయ్యారు. సిఎం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. బయ్యారం, బ్రాహ్మిణి రద్దు నేపథ్యంలో వాన్‌పిక్ రద్దుపై అధికారులతో సిఎం చర్చిస్తున్నారని తెలుస్తోంది.

గుంటూరు, ప్రకాశం జిల్లాలో సుమారు ఇరవై ఐదు ఎకరాలను కేటాయించారు. ఇప్పటికే పద్దెనిమిది వేల ఎకరాలను ఆ జిల్లాలలో సమీకరించారు. వాన్‌పిక్‌కు ఇంత పెద్ద ఎత్తున భూములు కేటాయించడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి, పడుతున్నాయి. ఈ ఒప్పందం పూర్తిగా ఏ ఒక్కరికో లబ్ధి చేకూర్చేలా ఉందని, ప్రజలకు మేలు చేసేలా లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో వాన్‌పిక్ రద్దుపై అధికారులతో సిఎం చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వాన్‌పిక్ రద్దును ఏ క్షణంలోనైనా చేయవచ్చునని అంటున్నారు. వాన్‌పిక్‌కు భూముల కేటాయింపుపై ఇప్పటికే మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు విచారించారు. ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం మోపిదేవి జైలులో ఉన్నారు. కాగా వాన్‌పిక్‌కు భూములు కేటాయించిన కారణంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలలోకి పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే

English summary
After Brahmani Steels and Bayyarm mines lease cancellation, it is the Vadarevu and Nizampatnam Port and Industrial Corridor (Vanpic) project's turn to face the guillotine. Having decided to cancel the project on various grounds like irregularities in its conception as well as for it being a non-starter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X