పోలింగ్ ప్రారంభం, ముందే ఓటేసిన జగన్ పార్టీ కృష్ణదాస్

పలువురు హిజ్రాలు ఓటు హక్కు కలిగి ఉన్నారు. తిరుపతి నియోజకవర్గంలో డమ్మీ ఈవిఎంలను కనుగొన్నట్లుగా తెలుస్తోంది. 5413 పోలింగ్ కేంద్రాలు, 6266 బ్యాలెట్ మిషన్లను ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికల కోసం మొత్తం 50వేల మంది పని చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నరసన్నపేటలో టిడిపి అభ్యర్థి స్వామిబాబు, కాల్వచెరువులో కాంగ్రెసు అభ్యర్థి పార్వతి, నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాసు, ధర్మాన రాందాసు, ఎమ్మిగనూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డి తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా ఉప ఎన్నికలు ఓటింగ్ కొన్నిచోట్ల మందకోడిగా ప్రారంభమైంది. ఓటుహక్కును వినియోగించుకునేం దుకు చాలాచోట్ల ఓటర్లు క్యూ కట్టారు. ప్రత్తిపాడు వట్టిచెరువులో వర్షం కురువడంతో కాసేపు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ కొరత, ఈవిఎంల మొరాయింపు వల్ల కొన్ని చోట్ల ఆలస్యంగా వోటింగ్ ప్రారంభమైంది.
రాయచోటి, నెల్లూరు నియోజకవర్గాలలో ఓ పార్టీ నేతలు పోలింగ్ కేంద్రాలలోకి చొచ్చుకు రావడం, మరో పార్టీ నేతలు అడ్డుకోవడం కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి ధర్మాన కృష్ణదాసు పోలింగ్ ప్రారంభానికి పదినిమిషాల ముందే ఓటేసినట్లుగా సమాచారం. ముహూర్తం బాగుందని చెప్పి ఆయన అధికారులను అడగటంతో వారు అంగీకరించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications