నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్, జగన్ పార్టీ: ఉద్రిక్త పరిస్థితి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Udayagiri
నెల్లూరు/కర్నూలు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం కొండారెడ్డిపల్లెలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఎనిమిది మంది వరకు గాయపడ్డారు. ఉదయం ఎనిమిది గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభమయ్యాక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు దొంగవోట్లు వేస్తున్నారని ఆందోళన చేశారు.

దీంతో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త వేడెక్కింది. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. బూత్ వద్దే బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉప ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ వడదెబ్బతో మృతి చెందాడు.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో రికార్డ్ స్థాయిలో మధ్యాహ్నం లోపే పోలింగ్ నమోదు అయింది. రుద్రవరం మండలంలోని కొత్తవెలగపల్లిలో లంచ్ లోపే 90 శాతం పోలింగ్ పూర్తయింది. గ్రామంలో ఉన్న 221 మంది ఓటర్లలో 203 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కడప జిల్లా రాజంపేటలో డబ్బు పంచుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు జానకి రామయ్య, సుబ్బారెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరంలో కాంగ్రెసు నేత శివప్పగౌడ్‌ను పాస్ లేకుండా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో గుర్తు తెలియని వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నేత ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రైల్వేకోడూరులో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

English summary

 Eight congress activists injured in SPS Nellore district on Tuesday. Congress and YSR Congress party activists thrown stones at each other in Udayagiri constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X