జగన్ వైపు: ఎమ్మెల్యేల కాపు కాస్తున్న బాబు, బొత్స!

Chandrababu Naidu-Botsa Satyanarayana-YS Jagan
హైదరాబాద్: శుక్రవారం ఉప ఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నేతలు గురువారం సమావేశం కానున్నారు. 2014 ఎన్నికలకు ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికలను అన్ని పార్టీలు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నాయి. టిడిపి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు భవిష్యత్తును ఉప ఎన్నికలు తేల్చనున్నాయి. ఈ నేపథ్యంలో ఏం సాయంత్రం ఆ పార్టీల నేతలు పార్టీ కార్యాలయాలలో సమావేశమవనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుత ఉప ఎన్నికల ఫలితాల పైనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సీట్లు తక్కువొచ్చినా ఎక్కువొచ్చినా ఆ ప్రభావం పార్టీ పైన బాగానే పడుతుంది. అదేవిధంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ పైనా ఫలితాల ప్రభావం పడనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వైయస్సార్ కాంగ్రెసు 12-16 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కూడా చెరో రెండు నుండి నాలుగు సీట్లు గెలుచుకునే అవకాశమున్నాయని తేల్చాయి.

ఉప ఎన్నికలలో జగన్ పార్టీ అన్ని స్థానాలను కైవలం చేసుకుంటే టిడిపి, కాంగ్రెసుల నుండి జోరుగా వలసలు వైయస్సార్ కాంగ్రెసు వైపు వెళతాయి. కాంగ్రెసు, టిడిపిలకు బాగానే నష్టం జరిగే అవకాశముంది. ఒకవేళ జగన్ పార్టీ అనుకున్న విధంగా సీట్లు సాధించకపోతే వైయస్సార్ కాంగ్రెసు చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. నేతలు వెళ్లిపోయినప్పటికీ టిడిపి, కాంగ్రెసులకు కార్యకర్తల బలం ఉంది. కానీ వైయస్సార్ కాంగ్రెసుకు ఆ బలం లేదు.

ప్రస్తుతానికి ఆ పార్టీ సెంటిమెంట్ పైనే నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి గెలుపు ఖచ్చితంగా అవసరం. ఉప ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీల పైన తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, జగన్ పార్టీ పైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు ఆయా పార్టీల నేతలు సమావేశం కానున్నారు. ప్రస్తుతం నేతలంతా రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ పెళ్లికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.

ఆయా పార్టీల నేతలు పెళ్లి వేడుక నుండి నేరుగా వారి వారి పార్టీ కార్యాలయాలకు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలు జగన్ వైపు మొగ్గుతాయని సర్వేలు ఇప్పటికే చెప్పాయి. కాంగ్రెసు, టిడిపి నేతల మదిలో కూడా అదే ఉంది. జగన్ పార్టీ అఖండ మెజార్టీ సాధిస్తా కాంగ్రెసు, టిడిపిల నుండి పలువురు నేతలు జగన్ వైపు జంప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు జగన్ వైపు వెళ్తారని అనుమానమున్న ప్రజాప్రతినిధులపై ఓ కన్ను వేస్తున్నారట.

జగన్ పార్టీ మంచి మెజార్టీ సాధిస్తే కాంగ్రెసు పార్టీ నుండి 12 మంది ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అనుమానితులను గమనిస్తున్నారట. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కూడా జంప్‌ల తలనొప్పి ఉందని అంటున్నారు. టిడిపిలో నలుగురు ఎమ్మెల్యేలు, ఒక శాసనమండలి సభ్యుడు వైయస్సార్ కాంగ్రెసు మంచి ఫలితాలు సాధిస్తే జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట. వారి పైన ఓ కన్నేసి ఉంచమని చంద్రబాబు తనకు విశ్వాసపాత్రులైన నేతలకు చెప్పారట.

మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైనా వైయస్ విజయమ్మ అధ్యక్షతన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమావేశం కానుందని తెలుస్తోంది. ఈ సమావేశానికి జగన్ సోదరి షర్మిల కూడా హాజరయ్యే అవకాశముంది. జగన్ సతీమణి భారతి సహా బంధువులు, పలువురు పార్టీ నేతలు చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను కలిశాక పార్టీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+