హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఫలితాలు: కిరణ్ రెడ్డి, బొత్స, చిరంజీవి సేఫ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana - Kiran Kumar Reddy
హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెసు పార్టీకి ఊరటనిచ్చాయి. వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు భారీ మెజారిటీ రాకపోవడం అందుకు ఒక కారణం కాగా, దాదాపు సగం స్థానాల్లో తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో నిలిచినా ఓట్ల తేడా తక్కువగానే ఉంది. తెలుగుదేశం పార్టీ చాలా స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల మధ్య ఓట్లు చీలి తమకు లాభం చేకూరుతుందని తెలుగుదేశం పార్టీ విశ్వసించింది. అయితే, ఈ ఉప ఎన్నికల్లో అలాంటి ధోరణి కనిపించలేదు. ఈ పరిస్థితిలో కూడా ప్రస్తుత ఫలితాలతో కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ స్థానాలు పదిలంగా ఉంటాయని చెప్పవచ్చు.

వైయస్సార్, కాంగ్రెసు పార్టీల మధ్యనే హోరాహోరీ పోరు సాగింది. ప్రస్తుత ఫలితాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి ఊరటనిచ్చాయనే చెప్పాలి. ప్రస్తుత ఫలితాలతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పెద్దగా మారే సూచనలు కనిపించడం లేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుకున్నట్లు అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ మెజారిటీలు తక్కువగా ఉండడం దానికి కారణం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 2014 ఎన్నికల నాటికి మరింతగా తన బలాన్ని కోల్పోతుందనే వాదనను పార్టీ అధిష్టానం ముందు పెట్టడానికి రాష్ట్ర నాయకత్వానికి అవకాశం చిక్కింది.

ఉప ఎన్నికలు జరిగిన 18 శాసనసభా స్థానాలు కూడా కాంగ్రెసు పార్టీకి చెందినవే అయినా, వైయస్ జగన్ పార్టీతో కాంగ్రెసు గల్లంతవుతుందనే అంచనాలను ఈ ఉప ఎన్నికలు తిప్పకొట్టాయి. తాము కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించడానికి వీలవుతుందని రాష్ట్ర కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పట్ల ఇప్పుడున్న సానుభూతి సాధారణ ఎన్నికల నాటికి ఉండదనే అభిప్రాయాన్ని కాంగ్రెసు రాష్ట్ర నాయకులు ముందుకు తెస్తున్నారు.

కాగా, నెల్లూరు లోకసభ స్థానంలో మాత్రం కాంగ్రెసుకు పెద్ద దెబ్బనే తగిలింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెసు అభ్యర్థి టి. సుబ్బిరామి రెడ్డిపై భారీ ఆధిక్యతతో విజయం సాధించింది. అయితే, సుబ్బిరామిరెడ్డి చాలా కాలంగా నెల్లూరు జిల్లాకు దూరంగా ఉండడం ఓటమికి కారణమని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. మొత్తం మీద, రాష్ట్ర కాంగ్రెసు నాయకులకు ఊపిరి పీల్చుకునే ఫలితాలే వచ్చాయని చెప్పాలి.

English summary
The bypoll results are relief to CM Kiran kumar Reddy, PCC president Botsa Satyanarayana and Rajyasabha member Chiranjeevi, as Congress gave tough fight to YSR Congress and cornered Telugudesam party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X