పరకాలలో టెన్షన్ పెట్టిన కొండా సురేఖ, గట్టెక్కిన తెరాస

Bixapathi - Konda Surekha
హైదరాబాద్: తెలంగాణలోని పరకాల శాసనసభా నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆధిక్యం గణనీయంగా తగ్గినప్పటికీ ఎట్టకేలకు గట్టెక్కింది. తీవ్ర ఉత్కంఠ మధ్య తెరాస అభ్యర్థి బిక్షపతి 1,517 ఓట్లు మెజారిటీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై విజయం సాధించారు. ఒక సమయంలో వైయస్సార్సిపీ అభ్యర్థి కొండా సురేఖ 165 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ తెరాస ఆధిక్యంలోకి వచ్చింది. తెరాస 283 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. మరో 15 వేల ఓట్లు లెక్కించాల్సి ఉన్న స్థితిలో అలా ఉంది. దీంతో పరకాల విజయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 14వ రౌండ్ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ పుంజుకున్నారు. తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలోకి వెళ్లింది. చివరి రౌండ్‌లో తెరాస అభ్యర్థి బిక్షపతి ఆధిక్యత ప్రదర్శించి విజయం సాధించారు. తెరాసకు సవాల్ విసిరి బరిలోకి దిగిన బిజెపి నాలుగో స్థానంలో ఉంది. నైతిక విజయం తనదేనని కొండా సురేఖ అన్నారు. తెరాసకు కాంగ్రెసు పార్టీ పరోక్షంగా సహకరించిందని, అందుకే తెరాస విజయం సాధించిందని ఆమె అన్నారు.

నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాంగ్రెసు అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డిపై లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఉదయగిరి శాసనసభా స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి విజయం సాధించారు. తిరుపతి స్థానంలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతుంది.

ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 14 స్థానాలు గెలుచుకుని ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది, కాంగ్రెసు పార్టీ రెండు స్థానాల్లో గెలిచింది. అయితే, తిరుపతిలో మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి, కాంగ్రెసు అభ్యర్థి వెంకటరమణ మధ్య పోరు హోరాహోరీగా ఉంది. రెండో రౌండులో వెంకటరమణ 59 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆళ్లగడ్డలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభానాగి రెడ్డి గెలిచారు. రాయదుర్గంలో కూడా వైయస్సార్ కాంగ్రెసు గెలిచింది.

ఎమ్మిగనూరు, రాజయంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, పోలవరం, పాయకరావుపేట, మాచర్ల, ప్రత్తిపాడు, రామచంద్రాపురం తదితర నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం సాధించింది. నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు సాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+