అళ్లగడ్డ, ప్రత్తిపాడుల్లో జగన్ పార్టీ ముందంజ

తిరుపతి నియోజకవర్గంలో తొలుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వెంకటరమణ ఆధిక్యంలోకి వచ్చారు. భూమన తొలుత కేవలం 14 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత వెంకటరమణ 16 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి మొదటి రౌండులో 3500 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. ఈ మూడు నియోజకవర్గాల్లోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయం పట్ల సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఈ నెల 12వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 18 శాసనసభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందనే అంచనాలు సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications