ప్రజలు మమ్మల్ని దోషులాగు చూస్తున్నారు: కెకె

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరకాల అభ్యర్థి తెలంగాణవాదాన్ని బలంగా వినిపించారని, అందుకే సురేఖ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి పోటీ ఇచ్చారని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం ముందు తమ వాదనను మరోసారి వినిపిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానాన్ని ఒప్పిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణపై సహనం నశించిందని, ఇక రాజీ పడేది లేదని ఆయన అన్నారు.
పరకాల నియోజకవర్గంలో ప్రలోభాలకు గురి చేసిన ప్రజలు తెలంగాణవాదాన్ని గెలిపించారని ఆయన అన్నారు. అందరూ తెలంగాణవాదానికి అనుకూలంగా ఉన్నారని తేలిపోయిందని ఆయన అన్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. సాధ్యమైనంత త్వరగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని, అలా నిర్ణయం తీసుకునేలా తాము ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు.
తెలంగాణ శక్తులన్నీ రాష్ట్ర సాధనకు ఏకం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసిలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై ఇప్పటికైనా కళ్లు తెరవాలని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై అభిప్రాయం మార్చుకోవాలని తాము కేంద్ర మంత్రి వాయలార్ రవికి సూచిస్తామని మరో పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అన్నారు.
విశ్వసనీయత లేకపోవడం వల్లనే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మట్టి కరిచాయని తెలంగాణ నగారా సమితి నాయకుడు, శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఇకనైనా మేల్కొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications