గెలుపుపై ఏముంది?: ఈనాడు, జ్యోతి చూస్తున్న జగన్

YS Jagan
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వార్తాపత్రికలు చదవడం కోసమే ఎక్కువ సమయం గడుపుతున్నారట. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలలో పదిహేనింటిని జగన్ పార్టీ కైవసం చేసుకుంది. నెల్లూరు లోకసభ కూడా ఆయన ఖాతాలోనే పడింది.

దీంతో ఉప ఎన్నికలలో తన పార్టీ అభ్యర్థుల ఘన విజయం గురించి ఏ పత్రిక ఎలా రాసిందో తెలుసుకొనేందుకు జగన్ ఆసక్తి కనబరుస్తున్నారట. ఇందుకోసం పలు ఇంగ్లీషు, తెలుగు దిన పత్రికలు చదువుతున్నారు. జైలులో ఉన్న విఐపి ఖైదీలు తనకు ఫలానా వార్తా పత్రిక కావాలని అడిగితే.. అతని ఖాతా జైలు ఖాతా నుండి అందిస్తారు. ఈ సౌకర్యంతో జగన్ పలు పత్రికలు తెప్పించుకుంటున్నారట.

ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షితో పాటు పలు ఆంగ్ల పత్రికలు తెప్పించుకొని చదుతున్నారట. మరోవైపు సోమవారం మధ్యాహ్నం జగన్‌ను ఆయన సతీమణి వైయస్ భారతి రెడ్డి జైలులో కలిశారు. భారతితో పాటు వైవి సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తదితరులు కలిశారు.

కాగా నాంపల్లి ప్రత్యేక కోర్టు జగన్‌ను విచారించేందుకు అనుమతివ్వాలన్న ఎన్‌పోర్సుమెంట్ డైరెక్టరేట్ పిటిషన్‌ను ఈ నెల 20వ తేదికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు జగన్‌కు నోటీసులు జారీ చేసింది. నోటీసులు తీసుకోవడానికి జగన్ తరఫు న్యాయవాదులు అంగీకరించక పోవడంతో జైలు అధికారుల ద్వారా జైలులో ఉన్న జగన్‌కు అందజేయనున్నట్లు ఈడి తరఫు న్యాయవాది తెలిపారు. మొదట కేసును 26వ తేదికి వాయిదా వేసినప్పటికీ న్యాయవాది అభ్యర్థన మీద 20వ తేదికి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+