గాలి బెయిల్ డీల్, పట్టాభికి కోర్టులో ఆశాభంగం

Pattabhi Ramarao
హైదరాబాద్: ముడుపులు తీసుకుని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఒఎంసి కేసులో బెయిల్ మంజూరు చేశారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న పట్టాభి రామారావుకు కోర్టులో శనివారం ఆశాభంగం కలిగింది. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని కోరుతూ సస్పెన్షన్‌కు గురైన పట్టాభి రామారావు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

ముడుపులు అంగీకరించి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినట్లు వచ్చిన ఆరోపణల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) పట్టాభి రామారావును అరెస్టు చేసింది. కాగా, ఇదే కేసులో రిటైర్డ్ న్యాయమూర్తి చలపతిరావును, పట్టాభి రామారావు కుమారుడు రవిచంద్రను ఐదు రోజుల పాటు ఎసిబి కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా వుంటే, ఎన్నారై భూకబ్జా కేసులో సూరి హత్యకేసు నిందిడుతు భాను కిరణ్, పులివెందుల కృష్ణను సిఐడి కస్టడీలోకి తీసుకుంది. శనివారం ఉదయం వీరిని చర్లపల్లి జైలునుంచి సిఐడి కార్యాలయానికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లిలో ఎన్నారై సునీతకు చెందిన 25 ఎకరాల భూమిని కబ్జా చేసి ఆమెను బెదరించిన నట్లు వీరిపై ఆరోపణల నేపథ్యంలో అదుపులోనికి తీసుకున్న సీఐడీ అధికారులు వీరిని కోర్టులో హాజరుపర్చారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఐదు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

హంద్రీ నీవా ప్రాజెక్టులో కాంట్రాక్టర్లను బెదిరించిన విషయాలపై కూడా సిబిఐ అధికారులు భాను కిరణ్‌ను, దంతలూరి కృష్ణ అలియాస్ పులివెందుల కృష్ణను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరిని సిఐడి అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+