భాను కిరణ్ లింక్స్: డిజిపిని కలిసిన అల్లు అరవింద్

నిర్మాత నట్టి కుమార్ ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కొద్ది ప్రముఖ నిర్మాతలపై, ఫైనాన్షియర్లపై కేసులు నమోదు చేశారు. అల్లు అరవింద్‌తో పాటు నిర్మాతలు కె. అశోక్ కుమార్, ఎంఎల్ కుమార్ చౌదరి డిజిపి వి. దినేష్ రెడ్డిని, సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్వీ రమణమూర్తిని కలిశారు. ఫిల్స్ చేంబర్స్ తరఫున వారు పోలీసు ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యను వివరించారు.
కేసులు నమోదు చేయడానికి ముందు చిత్ర పరిశ్రమ ప్రముఖులపై వచ్చిన ఫిర్యాదుల మంచీచెడులను పరిశీలించాలని వారు కోరారు. నట్టి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు నిర్మాతలు సి. కళ్యాణ్, సింగనమల రమేష్, ఆంజనేయ గుప్తాలపై కేసులు నమోదు చేశారు. నట్టి కుమార్ మరింత మందిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతుననారు.
పంపిణీదారులకు, నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు మధ్య వివాదాలు అతి సాధారణమని నిర్మాతలు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటేనే కేసులు నమోదు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అయితే, పోలీసు ఉన్నతాధికారులను కలిసి వివరించిన విషయాలపై నిర్మాతలు పెదవి విప్పడం లేదు.
-
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
మే 1 నుంచి సినిమా థియేటర్లు బంద్? -
టాలీవుడ్‌లో మరో జంట విడాకులు.. షాక్‌లో ఫ్యాన్స్! -
కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు.












Click it and Unblock the Notifications