చంద్రబాబు, లగడపాటి వీధినాటకం: జగన్ పార్టీ నేత

ఫ్లై ఓవర్ విషయంపై వారిద్దరు సోమవారం విజయవాడలో ధర్నాలకు దిగడంపై ఆమె ఆ విధంగా వ్యాఖ్యానించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే ప్రజాసమస్యలపై పోరాడాలని ఆమె సూచించారు. ప్రతిపక్షంగా ప్రజలు ఇచ్చిన బాధ్యతను చంద్రబాబు విస్మరించారని ఆమె విమర్శించారు. డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతులు స్వర్ణయుగాన్ని చూశారని ఆమె అన్నారు. ఇప్పుడు రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆమె అన్నారు.
పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. ఖరీఫ్ ప్రారంభమైనా రుణాలకు సంబంధించిన విధానాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదని ఆమె అన్నారు. ఎరువుల ధరలు పెరిగాయని, విత్తనాల ధరలు పెరిగాయని, ఎరువులు, విత్తనాలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక పక్క రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఏమీ మాట్లాడడం లేదని, నిజాయితీ ఉంటే తెలుగుదేశం రైతుల సమస్యలపై పోరాడాలని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications