వైయస్ మోసం: శంకరన్న, భూపందేరాలు: విహెచ్

V Hanumanth Rao-P Shankar Rao
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు పి. శంకర రావు అన్నారు. మన మధ్యలో లేని వైయస్ రాజశేఖర రెడ్డి మోసం చేశారని, మిగతావారున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. నిర్ణయాల వెనక ఉన్న సలహాదారుడిని పట్టుకోవాలని ఆయన అన్నారు. వివాదాస్పద జీవోల జారీ విషయంలో ఆరుగురు మంత్రులున్నారని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆరుగురు మంత్రుల్లో బలహీనవర్గాలకు చెందిన యువనాయకుడు మోపిదేవి వెంకటరమణను మాత్రమే అరెస్టు చేశారని, మిగతావాళ్లను ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో తాను నోటీసులు కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పద్ధతి వల్ల కాంగ్రెసుకు బలహీన సామాజిక వర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. బయట ఉన్న మంత్రులను సిబిఐ విచారించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు విమర్శించారు. కొందరు కడపవాసులు, మిగతా అధికారులు హైదరాబాదును దోచుకున్నారని ఆయన మంగళవారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రభుత్వ న్యాయవాదులు ప్రైవేట్ వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నారని ఆయన విమర్శించారు.

2002 నుంచి జరిపిన పట్టమ భూక్రమబద్దీకరణలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదులోని అంబర్‌పేటలో పాఠశాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని ఆయన విమర్శించారు. ఈ ప్రాంత భూముల సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన చేపడుతానని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+