విద్యార్థినిపై అత్యాచారం,హత్య: శ్రీశైలంలో మరోఅమ్మాయి

Hyderabad
హైదరాబాద్/కర్నూలు: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మంగళవారం ఒకే రోజు రెండు దారుణాలు వెలుగు చూశాయి. కూకట్‌పల్లిలో ఓ బాలికను గుర్తు తెలియని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత అత్యాచారం విషయం ఎవరికీ తెలియకూడదన్న ఆలోచనతో ఆమెను అక్కడికక్కడే హత్య చేశారు. మరోవైపు నాలుగు రోజుల క్రితం సైదాబాదులో అదృశ్యమైన యాదమ్మ అనే విద్యార్థిని కర్నూలు జిల్లా శ్రీశైలం అడవులలో విగత జీవిగా కనిపించింది.

యాదమ్మ ఇంటి నుండి నాలుగు రోజుల క్రితం వెళ్లింది. అప్పటి నుండి ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. మంగళవారం ఉదయం శ్రీశైలం అడవులలో ఆమె మృతదేహం కనిపించింది. స్నేహితుడే చంపి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాదమ్మను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ స్నేహితుడు ఆమెను అక్కడకు తీసుకు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. యాదమ్మ తొమ్మిదో తరగతి చదువుతోంది. యాదమ్మ, ఆమె స్నేహితుడు ఒకే గ్రామానికి చెందిన వారని సమాచారం.

మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి పరిసరాలలో ఓ మహిళ శవం కాల్వలో కనిపించింది. కోరుకొండ మండలం కణపూర్ గ్రామం సమీపంలోని కాల్వలో నరకబడి ఉన్న మహిళ శవం దొరికింది. అది ఎవరి శవమో కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలం మల్లాపురం తండాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన దుండగులు భార్యాభర్తలపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కాగా తిరుమల పరిసరాలలో పద్నాలుగు మంది ఎర్రచందనం స్మగ్లర్లను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. వీరంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం సమీపంలోని మూసీనదిలోని ఓ పడవలో పోలీసులు 119 బుల్లెట్లు కనుగొన్నారు. ఇవి నక్సలైట్లవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఇక్కడే ఓ రైఫిల్ లభ్యమయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+