నాయకత్వ మార్పిడి: సదానందకు అధిష్టానం ఝలక్!?

వారు పార్టీ నాయకత్వం కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతల నుండి అభిప్రాయాలు సేకరించనున్నారని సమాచారం. మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, ముఖ్యమంత్రి డివి సదానంద గౌడ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ ఈశ్వరప్ప తదితరుల నుండి కూడా అభిప్రాయాలు తీసుకుంటారని తెలుస్తోంది.
గతంలో యడ్యూరప్పను తొలగించిన సమయంలో అందరి ఆమోదం మేరకు సదానంద గౌడను ఎన్నిక చేయలేదనే విమర్శల నేపథ్యంలో ఈసారి అందరి అభిప్రాయాలు తీసుకొని కొత్త నేతను ఎన్నిక చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. పార్టీలోని అందరి అభిప్రాయం మేరకే నేతను ఎంపిక చేసేందుకే ప్రధాన్, సతీష్ బెంగళూరు వస్తున్నారని సమాచారం.
అందరి అభిప్రాయాలు సేకరించిన అనంతరం వారు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి ఓ నివేదిక సమర్పిస్తారు. యడ్యూరప్ప వర్గం వాదన ప్రకారం.. నాయకత్వాన్ని మార్చడమే ఉత్తమంగా అధిష్టానం భావిస్తోంది. ఇటీవల నాగపూర్‌లో గడ్కరీ తనయుడి వివాహం జరిగింది.
అప్పుడే యడ్యూరప్పకు, ఆయన వర్గానికి జాతీయ అధ్యక్షుడు నాయకత్వ మార్పిడిపై హామీ ఇచ్చారని అంటున్నారు. నాయకత్వ మార్పిడి వార్తల నేపథ్యంలో యడ్యూరప్ప తనకు మద్దతుగా ఉండే మంత్రులను కలుస్తున్నారు. ఉదసాయి, రేణుకాచార్య, బసవరాజ్ తదితరులను ఆయన కలిశారని సమాచారం.












Click it and Unblock the Notifications