సానుభూతి వల్లే జగన్ పార్టీ విజయం: చిరంజీవి

Chiranjeevi
న్యూఢిల్లీ: సానుభూతి వల్లనే ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిచిందని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాత ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో విఫలం కావడానికి గల కారణాలను, రెండు చోట్ల విజయం సాధించడానికి గల కారణాలను సోనియాకు వివరించినట్లు ఆయన తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే సోనియాకు ఓ అవగాహన ఉందని ఆయన చెప్పారు.

వైయస్ జగన్‌పై సానుభూతి వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలిచిందని, అది కాంగ్రెసుకు ప్రతికూలంగా పనిచేసిందని ఆయన అన్నారు. రెండు చోట్ల తనవల్లనే కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు గెలిచారని తాను అనలేదని, తన మాటలను మీడియా వక్రీకరించిందని ఆయన అన్నారు. సమన్వయంతో పనిచేయడం వల్ల గెలిచామని మాత్రమే తాను అన్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలని అంశాలపై తాను సోనియాతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

తాము ఎవరు ఎవరినీ టార్గెట్ చేయడం లేదని, 2014 ఎన్నికల్లో విజయమే టార్గెట్‌గా కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. సోనియాతో చర్చల్లో తనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే విషయం ప్రస్తావనకు రాలేదని ఆయన అన్నారు. అది వారి ఇష్టమని, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఆ విషయం ప్రస్తావనకు రాలేదని ఆయన అన్నారు. సోనియా గాంధీతో తెలంగాణ విషయం మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.

పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు పార్టీలో సమన్వయం సాధించాలని తాను సోనియాతో చెప్పినట్లు ఆయన తెలిపారు. కార్యాచరణ ఎలా ఉండాలనే విషయాలను మాట్లాడానని ఆయన చెప్పారు. కార్యకర్తగా పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, సోనియా ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీ కార్యకర్తగా ప్రజా సేవ చేస్తానని ఆనయ అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. ప్రజా సేవలోనే తనకు సంతృప్తి ఉందని ఆయన అన్నారు.

తనకు కోరికలు లేవని, తాను ఏ విధమైన షరతులు పెట్టడం లేదని ఆయన అన్నారు. మళ్లీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ఓటు బ్యాంకు చెదరదని ఆయన అన్నారు. మంత్రులపై వచ్చిన అభియోగాలు ఆరోపణలు మాత్రమేనని, ఆరోపణలు రుజువు కాలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+