సిబిఐ జెడి కాల్ లిస్ట్, వికెట్ డౌన్: నాచారం సిఐ సస్పెన్షన్

సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ కాల్ లిస్టును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. లీడ్ ఇండియా కార్యకర్త, ఐబిఎం ఉద్యోగిని వాసిరెడ్డి చంద్రబాల సిబిఐ జెడితోను, ఆంధ్రజ్యోతి ఎండితోని మాట్లాడటం తమకు అనుమానాలు కలిగిస్తోందని వారు అన్నారు. వారు పలువురు మీడియా ప్రతినిధుల పేర్లను కూడా పేర్కొన్నారు. ఇది వివాదాస్పదమైంది. దీనిపై చంద్రబాల, సిబిఐ జెడి ఇద్దరూ పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
చంద్రబాల మంగళవారం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిందంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక విలేకరి పైన, నాచారం సిఐ శ్రీనివాస్ రావు పైన ఈ కేసు నమోదయింది.
వారి పైన ఐపిసి 120బి 505, 509, ఐటి చట్టం 66, 72, సమాచార సాంకేతిక చట్టం, భారతీయ టెలిగ్రాఫ్ చట్టం తదితర సెక్షన్ల క్రింద, అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. చంద్రబాల ఫిర్యాదు చేశారని, విచారణ జరిపిస్తామని సిపి ద్వారకా తిరుమల రావు చెప్పారు. విచారణ బాధ్యతను సైబర్ క్రైం ఎసిబికి అప్పగించినట్లు చెప్పారు. ఎసిబి స్థాయి అధికారులచే విచారణ జరిపిస్తున్నామన్నారు. సిబిఐ జెడి కూడా అదే రోజు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications