దారుణం: కుప్పగా పసికందుల మృతదేహాలు లభ్యం

మృతదేహాల ఘటనకు ఖచ్చితంగా కారణాలు తెలియరాలేదు. అయితే ప్రయోగాల నిమిత్తం వైద్యులు వాడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీపంలోని ఆసుపత్రుల నుండి తీసుకు వచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయివేటు మెడికల్ కళాశాలలో విద్యార్థుల పరీక్షల కోసం కూడా తెచ్చి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అనే కోణంలో దృష్టి సారించారు. ఒకేసారి ఇన్ని మృతదేహాలు బయట పడటంతో పోలీసు శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. అన్ని శరీరాలు గడ్డకట్టుకొని ఉండటంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రెండు వారాల క్రితం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బలవంతపు అబార్షన్ల కోణంలోనూ దృష్టి సారిస్తున్నారు.
మృతదేహాల ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసు, వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. కాగా ప్రయివేటు ఆసుపత్రుల వద్ద గట్టి నిఘా పెడతామని జిల్లా డిఎస్పీ హిమవతి చెప్పారు. కాగా గతంలో సరూర్ నగర్ చెరువులో ఏడు మృతదేహాలు లభ్యమవడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications