ఫోరం వ్యతిరేకం: రాయల తెలంగాణకు నో అన్న ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao
వరంగల్: రాయల తెలంగాణకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ పోరం పూర్తి వ్యతిరేకమని ఫోరం కన్వీనర్, పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం వరంగల్‌లో అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన వస్తే తాము కలిసి వచ్చే పార్టీలతో ఉద్యమిస్తామని చెప్పారు. హైదరాబాదులోని తెలంగాణను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే రాయల తెలంగాణ పేరుతో అధికార కాంగ్రెసు పార్టీ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు.

రాయల తెలంగాణ ప్రతిపాదన పైన తక్షణమే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించాలని డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ వల్ల తెలంగాణ ప్రజలకు ఒనగూరేదేమీ లేదన్నారు. అలాంటి ప్రతిపాదన కాంగ్రెసు తీసుకు వస్తే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు కూడా దానిని వ్యతిరేకించాలని సూచించారు.

కాగా రాయల తెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించేది లేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణ జెఎసి సమావేశానంతరం ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాయల తెలంగాణ అంటే సీమాంధ్రులదే ఆధిపత్యం అవుతుందని ఆయన అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చినవారు తెలంగాణ ద్రోహులని ఆయన మండిపడ్డారు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిరనస కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు.

తెలంగాణ కాంగ్రెసు నాయకులు రాయల తెలంగాణ ప్రతిపాదన తేవడం అమానుషమని ఆయన అన్నారు. తెలంగాణ యువకుల త్యాగాలు రాయల తెలంగాణ కోసం కాదని, తెలంగాణ కోసం మాత్రమేనని ఆయన అన్నారు. హైదరాబాద్ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మాత్రమే తాము అంగీకరిస్తామని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని ఆయన తెలంగాణ జిల్లాల ప్రజలకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+