విశాఖలో స్కూల్ పైకప్పు కూలి చిన్నారి మృతి

Vishakapatnam
విశాఖపట్నం/ కరీంనగర్/ శ్రీకాకుళం: పాఠశాల పైకప్పు కూలి ఓ చిన్నారి మరణించిన సంఘటన విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంలోని నాతయ్యపాలెంలో సాల్మన్ విద్యానికేతన్ అనే పాఠశాలను పూరి పాకలో నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నంలో ఈదురు గాలులతో కూడి భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో విద్యార్థులను ఒక గదిలోంచి మరో గదిలోకి తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో పైకప్పు కూలింది.

పైకప్పు మీద పడి ఒకటో తరగతి చదువుతున్న వర్షిణి అనే విద్యార్థిని మరణించింది. ఓ ఉపాధ్యాయురాలికి కూడా గాయలయ్యాయి. ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం. కాగా, శిథిలాల కింద మరో ఇద్దరు ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, అదేమీ లేదని అంటున్నారు. సరైన ఏర్పాట్లు లేని పాఠశాలకు విద్యాశాఖ అనుమతి ఇవ్వడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నారు.

ఇదిలా వుంటే, కరీంనగర్ జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు నిప్పంటించి, తాను నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కూడా మరణించారు. ఇందుకు గల కారణాలు తెలియడం లేదు. కరీంనగర్ జిల్లా మొర్రాయిపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలోనే మరో దారుణం జరిగింది. రామడుగు మండలం వెనిచాలలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి మృతి చెందగా యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళపై దాడి చేసి ఆమె కాళ్లు, చేతులు విరిచేశారు. రక్తపుమడుగులో ఉన్న మహిళను స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు ప్రాణాపాయస్థితి లేదని తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+