ఎమ్మెల్యేను, ఆమె రెండో భర్తను కొట్టిన గుంపు

కరీంగంజ్‌లోని ఓ హోటల్లో రాత్రి పొద్దుపోయేంత వరకు ఉన్న రూమీనాథ్‌ను, జాకీ జకీర్‌ను దాదాపు 200 మంది గుమికూడి కొట్టినట్లు పోలీసు సూపరింటిండెంట్ ప్రదీప్ పూజారి చెప్పారు. గత నెలలో రూమీనాథ్ రెండో పెళ్లి చేసుకున్నందుకు ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. రూమీనాథ్ గర్భవతి. ఈ ఘటనలో రూమీనాథ్, జకీర్ తీవ్రంగా గాయపడినట్లు, రక్తమోడినట్లు, గుంపు నుంచి వారిని పోలీసులు రక్షించినట్లు చెబుతున్నారు.
చికిత్స అనంతరం ఎస్కార్టు సాయంతో వారిద్దరిని పోలీసులు రాష్ట్ర రాజధాని గౌహతికి పంపించివేశారు. బరాక్ లోయలోని బోర్ఖోలా నియోజకవర్గానికి నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండానే తాను జకీర్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు రూమీనాథ్ ప్రకటించినప్పటి నుంచి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి భర్త రాకేష్ సింగ్ తన భార్య రెండు నెలల నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాకేష్ సింగ్, రూమీలకు రెండేళ్ల కూతురు ఉంది. రూమీనాథ్ 2006లో బిజెపి తరఫున పోటీ చేసి బోర్ఖోలా నుంచి మొదటిసారి శానససభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెసులో చేరారు. రెండోసారి ఆమె 2011లో శానససభకు ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications