స్పందించరేం?: బాబు, వైయస్ విజయమ్మకు హరీష్

కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడానికి తమ పార్టీ ఏమాత్రం వ్యతిరేకం కాదన్నారు. అయితే తెలంగాణ ప్రజల గొంతు ఎండబెట్టి సీమాంధ్రకు నీళ్లివ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కృష్ణా డెల్టాకు నీళ్లు వదలడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. అర్ధరాత్రి దొంగచాటున నీళ్లు విడుదల చేస్తున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కోసమే మౌనంగా ఉన్నారని ఆరోపించారు.
ఈ అంశంపై కనీసం నిరసన తెలపని తెలంగాణ మంత్రులు ఆశ్రమాలలో చేరాలని ఎద్దేవా చేశారు. ప్రజలను రెచ్చగొట్టి విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ రైతుల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర సమితి పోరాడుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications