గాలి బెయిల్ డీల్: యాదగిరి చేతికి రూ. 9.5 కోట్లు

గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరైన రోజు రాత్రి మే 11వ తేదీన యాదగిరి రిటైర్డ్ న్యాయమూర్తి చలపతిరావుకు 9 కోట్ల రూపాయులు ఇచ్చినట్లు అంగీకరించాడని ఆయన చెప్పారు. యాదగిరి నివాసంలో తాము 3.75 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. సోమశేఖర రెడ్డి నుంచి తీసుకున్న డబ్బులతో యాదగిరి 8.1 లక్షల రూపాయలు పెట్టి మారుతి స్విఫ్ట్ కారు కొన్నాడని, రూ. 60 లక్షలతో నాచారంలో రెండు ఇళ్ల స్థలాలు కొన్నాడని ఆయన వివరించారు.
యాదగిరి ఎసిబి అధికారులు కర్నూలులో అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సస్పెండైన న్యాయమూర్తి పట్టాభిరామారావును, ఆయన కుమారుడు రవిచంద్రను, రిటైర్డ్ న్యాయమూర్తి చలపతిరావును ఎసిపి అధికారులు అరెస్టు చేశారు. ఇదిలా వుంటే, గాలి బెయిల్ స్కాం కేసులో తాజాగా ప్రభాకర రావు అనే జడ్జి పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. గాలి జనార్దన రెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జ్యుడీషియల్ ఆఫీసర్ (జిల్లా జడ్జి హోదా)గా పని చేస్తున్న ప్రభాకర్ రావు కూడా బేరం పెట్టినట్లు తేలింది.
ఎసిబి అధికారులు అరెస్టు చేసిన పట్టాభిరామా రావు కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్ జడ్జి చలపతిరావుల నేరాంగీకార పత్రంలో... బెయిల్ స్కామ్ గురించిన పూర్తి వివరాలు పూసగుచ్చినట్లున్నాయి. పట్టాభి రామారావును కోర్టు రెండు రోజుల ఎసిబి కస్టడీకి అప్పగించింది. ఎసిపి ఈ బెయిల్ విషయంలో పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తోంది. వారి వాంగ్మూలాలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications