సీమాంధ్రలో వైయస్ జగన్ ప్రభావం: మంత్రి టిజి వెంకటేష్

కాంగ్రెసు బలపేతమైతేనే తెలంగాణ అంశంపై ఓ స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రవిభజన జరిపితే తమకు రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, ఇందులో భాగంగానే తాము రాయల తెలంగాణ ప్రతిపాదనను పెడుతున్నామని ఆయన అన్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణపై స్పష్టత వస్తుందని, ఎన్నికలకు 9 నెలల ముందు తెలంగాణ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే రాష్ట్ర విభజనకు అంగీకరిస్తామని ఆయన చెప్పారు.
ఉప ఎన్నికల్లో ఓటమితోనైనా కాంగ్రెసు గుణపాఠం నేర్చుకోవాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ గారడీ చేస్తోందని ఆయన సోమవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు తెలంగాణ నేతలు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో మద్యం వ్యాపారులు ప్రచారం చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారా అని ఆయన అడిగారు.
తెలంగాణ సమస్య పరిష్కారానికి రాయల తెలంగాణ ప్రతిపాదనను కాంగ్రెసు అధిష్టానం లేదా కేంద్ర ప్రభుత్వం ముందుకు తెస్తున్నట్లు ఇటీవల విరివిగా ప్రచారంలోకి వచ్చింది. రాయల తెలంగాణ ప్రతిపాదనకు రాయలసీమకు చెందిన సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కూడా అంగీకరిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications