జగన్‌ను క్షేమ సమాచారమడిగిన విజయమ్మ, షర్మిల

కాగా నాలుగు రోజుల క్రితం శుక్రవారం కూడా ఆయన కుటుంబ సభ్యులు జగన్‌ను కలిశారు. వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి భారతి, సోదరి షర్మిలతో పాటు బ్రదర్ అనిల్ కుమార్‌లు కూడా ఆ రోజు కలిశారు. దాదాపు ఇరవై నిమిషాలు జగన్‌తో వారు భేటీ అయ్యారు.
కుటుంబ సభ్యుల అనంతరం మాజీ మంత్రి, వరంగల్ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖ, శాసనమండలి సభ్యుడు, సురేఖ భర్త కొండా మురళీధర రావు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు కలిశారు. అంతకుముందు కూడా వైయస్ భారతి రెడ్డి పలుమార్లు జగన్‌ను కలిశారు.
అప్పుడప్పుడు పలువురు నేతలు వచ్చి కలుస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి, జగన్ బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి, రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్న పిఎ సంగ్మాకు ఇటీవల జైలు వద్ద చుక్కెదురయిన విషయం తెలిసిందే. వారికి జైలు అధికారులు జగన్‌ను కలిసేందుకు అనుమతించలేదు. ములాఖత్‌లు ముగియడంతో అనుమతివ్వలేదని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications