హయత్‌నగర్ ఎఫెక్ట్: రేవ్ పార్టీలపై హైకోర్టు ఆగ్రహం

దీనిపై విచారణ చేపట్టింది. రెండువారాల్లోగా వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కోర్టు సుమోటోగా స్వీకరించిన ఈ పిటిషన్‌లో ప్రభుత్వంతో పాటు డిజిపిని, సైబరాబాద్ పోలీసు కమిషనర్‌లను కూడా ప్రతివాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసింది. రెండు వారాలలోగా దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి అవకాశమిస్తూ విచారణను వాయిదా వేసింది.
కాగా ఇటీవల హైదరాబాదులో రేవ్ పార్టీల పేరుతో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన విషయం బహిర్గతమైన విషయం తెలిసిందే. హయత్‌నగర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాలలో పోలీసులు పార్టీల పేరుతో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురుని అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్‌లో అయితే 25 మంది మహిళలు, 12 మంది మగవారిని పోలీసులు పట్టుకున్నారు.
ఇప్పటికే ముంబయి, ఢిల్లీ తదితర ముఖ్య పట్టణాలలో రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. ఇటీవల ముంబయిలోని జుహూలోని అజోక్ రూఫ్‌టాప్ హోటల్లో ఆదివారం రాత్రి జరిగిన రేవ్‌పార్టీలో టీవీ స్టార్స్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ రేవ్‌పార్టీపై పోలీసులు చేసిన దాడిలో 100 మందిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications