టెక్కీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్, ఆమె తల్లి ఆరోపణ

తన కూతురిని ఆమె భర్త షేక్ సదానీ పాషా కట్నం కోసం హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. అతను చాలా కాలంగా కట్నం కోసం తన కూతురిని వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. పాషా కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. తన భార్య షబానా నగరవారపాలయలోని తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని పాషా చెప్పాడు. పాషా వాంగ్మూలం ఆధారంగా బ్యాపనహళ్లి పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు.
డబ్బుల కోసం తన అల్లుడు తన కూతురిని హత్య చేశాడని షబానా తల్లి పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పాషా షబానా బంగారు ఆభరణాలన్నీ తీసుకున్నాడని, డబ్బులు డిమాండ్ చేస్తూ వస్తున్నాడని, ఈ విషయంపైనే ఇరువురి మధ్య ఘర్షణలు చెలరేగుతూ వస్తున్నాయని ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
షబానా తల్లిని ప్రశ్నించిన తర్వాత కేసును వరకట్నం వేధింపుల కేసు కిందికి మార్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తమ ఇంట్లో ఉరివేసుకుని తన భార్య షబానా మరణించిందని పాషా పోలీసులకు చెప్పాడు.












Click it and Unblock the Notifications