ఐఎస్ఐ చైర్మన్: ప్రణబ్‌పై సంగ్మా ఆఫీస్‌ఆఫ్‌ప్రాఫిట్ పంజా

ఒక వ్యక్తి ఒకే పదవికి అర్హుడని ఆయన పేర్కొన్నారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ప్రకారం ప్రణబ్ పోటీకి అనర్హుడు అని తెలిపారు. సంగ్మా లాయర్ సత్ఫల్ జైన్ ఈ రోజు రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ జనరల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ప్రణబ్ నామినేషన్‌ను స్క్రూటినీ సమయంలో తిరస్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు స్క్రూటినీకి చివరి రోజు. అయితే స్క్రూటినీని రేపటికి వాయిదా వేశారు. దరఖాస్తుల ఉపసంహరణకు చివరి రోజు జూలై 4.
సంగ్మా ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రణబ్‌ను ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ప్రణబ్ దాదా దరఖాస్తు తిరస్కరించబడుతుందని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు. సుబ్రహ్మణ్య స్వామి ఈ అంశంపై ట్వీట్ చేశారు. ప్రణబ్ నామినేషన్ తిరస్కరించే అవకాశముందని, అనుకోకుండా స్క్రూటినీ రేపటికి వాయిదా పడిందని ట్వీట్ చేశారు. కాగా ప్రణబ్ ముఖర్జీ, పిఏ సంగ్మాలు రాష్ట్రపతి రేసులో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా సంగ్మా ఫిర్యాదుపై కాంగ్రెసు నేతలు స్పందించారు. కలకత్తాలో ఉన్న ప్రణబ్ మద్దతుదారులు గత నెల 20నే ఆయన ఐఎస్ఐకి రాజీనామా చేశారని చెబుతున్నారు. స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ పదవికి తాను ఎప్పుడో రాజీనామా చేశానని, ఆ సంస్థతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ప్రణబ్ ముఖర్జీ సోమవారం స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications