కొత్త ట్విస్ట్: రిజైన్‌ల ఉపసంహరణ, సిఎం మార్పు హామీ!

Yeddyurappa -Sadanandha Gouda
బెంగళూరు: కర్నాటక రాజకీయంలో కొత్త ట్విస్ట్. రాష్ట్ర ప్రజలు ఏమాత్రం ఊహించని రీతిలో అధికార బిజెపిలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. తాము సూచించిన అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేయాల్సిందేనని పట్టుబడుతూ రాజీనామాలు సమర్పించిన తొమ్మిది మంది మంత్రులు సోమవారం అనూహ్యంగా వాటిని వెనక్కి తీసుకున్నారు. ముఖ్యమంత్రి మార్పుపై తమ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని అందుకే తాము రాజీనామాలు ఉపసంహరించుకున్నట్లు సదరు మంత్రులు ప్రకటించారు.

అధిష్టానంతో మరోసారి చర్చించాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం అధిష్టానం హామీ ఇచ్చిందని, అందుకే ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. బిజెపి ముఖ్య నేత అరుణ్ జైట్లీ సంక్షోభానికి కారకులైన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో ఎడతెరపని చర్చలు జరుపుతున్నారని సమాచారం. సిఎం మార్పుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు సంక్షోభానికి తెర పలకాలని జైట్లీ... యడ్డీని కోరారని తెలుస్తోంది. ఆ కారణంగానే వారు రాజీనామాలు ఉహసంహరించుకున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి సదానంద గౌడ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రుల రాజీనామాలు, ఉపసంహరణలపై ఆయన స్పందించారు. తొమ్మిది మంది మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకోవడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. తాను సాయంత్రం ఢిల్లీ వెళుతున్నానని చెప్పారు. సంక్షోభం విషయంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను సిద్ధమని ప్రకటించారు.

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సదానంద చెబుతున్నప్పటికీ... ఆయనను తొలగిస్తే ఆయన వర్గం నేతలు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే గౌడ వర్గం నేతలు అతనిని తొలగిస్తే తాము కూడా రాజీనామాలు చేస్తామని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+