సాయిరెడ్డి ఢిల్లీ యాత్ర పిటిషన్‌పై నిర్ణయం వాయిదా

విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు అవసరమైన సమయం ఏదో తెలియజేస్తూ అందుకు అనుగుణంగా తాము ఏర్పాటు చేసుకుంటామని సిబిఐ తరఫు న్యాయవాది చెప్పారు. దీనికి నెల రోజులు సమయం ఇస్తే సరిపోతుందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై విజయసాయి రెడ్డి తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు.
విజయసాయి రెడ్డి శాశ్వతంగా ఢిల్లీలో ఉండిపోవడానికి వెళ్లడం లేదని, అవసరమైనప్పుడు వెళ్లి వచ్చేలా అనుమతి ఇవ్వాలని అన్నారు. వెళ్లే ప్రతిసారీ సిబిఐకి సమాచారం ఇచ్చి విజయసాయి రెడ్డి వెళ్తారని ఆయన చెప్పారు. కాగా, నాన్ బెయిలబుల్ వారంట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఎమ్మార్ కేసు నిందితుడు శ్రవణ్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో బెయిల్ షరతులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ మరో నిందితుడు తుమ్మల రంగారావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణనను కోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
గాలి జనార్ధాన్‌రెడ్డి బెయిల్ ఫర్ సేల్ స్కాంలో అరెస్ట్ అయిన మాజీ న్యాయమూర్తులు పట్టాభిరామారావు, చలపతిరావుల బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారం నాటికి వాయిదా వేసింది. గాలి బెయిల్ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన పట్టాబి, ఆయన కుమారుడు రవిచంద్ర, చలపతిరావు ఈ ముగ్గురు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
కాగా పట్టాభి రామారావు రిమాండ్ మంగళవారంతో ముగియడంతో అధికారులు ఆయనను ఏసీబి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు జూలై 13 వరకు రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications