రెండు రోజుల్లో రాజకీయ పార్టీలకు లేఖలు: కోదండరామ్

ఇకపై స్థానిక సమస్యలను జోడించి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ఉద్యమిస్తామని తెలంగాణ ఆయన చెప్పారు. నిర్దిష్ట సమస్యలపై ప్రజలను కదిలించే కార్యాచరణ తీసుకుంటామని తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ జేఏసీ ప్రతినిధులు వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, డాక్టర్ రమేష్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. నాయకులకు వ్యతిరేకంగానే తమ పోరాటం ఉంటుందన్నారు.
ఈనెల 7న జరిగే జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు. అయితే ఈ భేటీకి భాగస్వామ్య రాజకీయ పార్టీలను పిలవటంలేదని, ఉద్యోగ-ప్రజా సంఘాలనే ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ సీట్ల కేటాయింపులో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని కోదండరాం ఆరోపించారు. సీమాంధ్రలోని మెడికల్ కాలేజీలకు సీట్లు ఇస్తే ఇచ్చారుకాని, తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో సీట్లు ఎందుకు పెంచలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక మెడికల్ సీటు కోసం 70వేల మంది విద్యార్థులు పోటీ పడుతుంటే, సీమాంధ్రలో మాత్రం 30 వేల మంది మాత్రమే పోటీపడుతున్నారని చెప్పారు.
దీంతో ఎంసెట్ మెడిసిన్‌లో ఇక్కడ వెయ్యి లోపు ర్యాంకు వస్తేనే సీటు లభిస్తుండగా, అక్కడ 2,500 ర్యాంకు వచ్చినా సీటు వస్తోందన్నారు. నిజామాబాద్‌కు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేసి రెండేళ్లు గడిచినా ఇంతవరకు ప్రారంభించలేదని, బీబీనగర్‌లో నిమ్స్ హాస్పిటల్ పరిస్థితి పైన పటారం..లోన లొటారం అన్నట్లుగా ఉందని చెప్పారు. ఇదంతా తెలంగాణను చిన్నచూపు చూడటమేనని, వివక్షకు గురిచేయటమేనని మండిపడ్డారు. వైద్య విద్యలో తెలంగాణ ప్రాంతం వెనుకబడి ఉందని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ప్రత్యేకంగా పేర్కొన్నప్పటికీ, పాలకుల్లో మాత్రం మార్పు రావటంలేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications