ఢిల్లీకి వైయస్ విజయమ్మ: ఐదుగురికి అనుమతి

తన తనయుడి అరెస్టు అక్రమమని, రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోలేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ప్రధానికి వివరించనున్నారు. జగన్ ఆస్తులపై కక్షతో కాకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆమె కోరనున్నారు. జగన్‌తో పాటు రాష్ట్రంలోని రైతాంగ సమస్యల పైనా ఆమె ప్రధానికి విన్నవించనున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆమె మన్మోహన్‌కు వినతిపత్రం అందించనున్నారు.
కాగా వైయస్ విజయమ్మతో పాటు ప్రధానమంత్రిని కలిసేందుకు మరో ఐదుగురు నేతలకు మాత్రమే అనుమతి లభించింది. పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, సబ్బం హరి, శాసనసభ్యులు శోభా నాగి రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు, వైవి సుబ్బారెడ్డి తదితరులు ఆమెతో పాటు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధానితో పాటు పలువురు ఢిల్లీ పెద్దలను వారు కలవనున్నారు. కాగా తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని విజయమ్మ ఇటీవల ప్రధానిని కోరింది. దాంతో పిఎంవో విజయమ్మతో పాటు మరో ఐదుగురు కలుసుకునేందుకు అనుమతించింది.
మరోవైపు తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జైలు నుండి విముక్తి లభించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కరీంనగర్ నుండి పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు వరకు పాదయాత్ర చేపట్టారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణకు జ్ఞానోదయం కలిగించాలని హనుమంతుడికి ముడుపులు కట్టారు. దేవుడి అనుగ్రహంతో జగన్ తప్పకుండా బయటకు వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications