విమానంలో ప్రయాణికుణ్ని కుట్టిన తేలు, తొక్కి చంపారు

ఆ తర్వాత విమానం టేకాఫ్ అయింది. అంతలోనే విద్యాసాగర్ పెద్దగా కేకలు పెడుతూ, బాధతో విలవిలలాడిపోయాడు. అప్రమత్తమైన ఎయిర్ హోస్టెస్ ఆరా తీయగా.. తన జేబులో చేయి పెడితే ఏదో కుట్టిందని విద్యాసాగర్ బాధతో ఆమెకు చెప్పారు. దీంతో ఎయిర్ హోస్టెస్ ఆయన కోటు జేబులో చూసింది. దానిని విదిలించగా అందులో నుంచి నల్లటి తేలు కిందపడింది.
దాంతో ప్రయాణీకులు బెదిరారు. విద్యాసాగర్ పక్కనే ఉన్న మరో ప్రయాణీకుడు వెంటనే ఆ తేలును చంపేశాడు. తేలు కుట్టడంతో విద్యాసాగర్‌ను చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. తాను ప్రయాణం విరమించుకుంటానని విద్యాసాగర్ చెప్పడంతో విమానం బహ్రెయిన్ వెళ్లిపోయింది. ఈ ఘటన చెన్నై విమానాశ్రయంలో రాత్రి పదిన్నర గంటలకు చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications